కోరెం లో వరస దొంగతనాలు

11-11-2026 | 08:48pm

భయాందోళనలో గ్రామస్తులు

బోయినపల్లి: నవంబర్ 11( విజయ క్రాంతి): రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినపల్లి మండలం కోరెం గ్రామంలో(Korem Village) వరస దొంగతనాలతో గ్రామస్తులు భయాందోళన కు గురవుతున్నారు. గత పది రోజుల క్రితం వేముల లత వ్యవసాయ కూలీ పనికి వెళ్ళగా గుర్తు తెలియని వ్యక్తులు తలుపు తీసి ఇంట్లోని బంగారు ఆభరణాలు, కొంత నగదు చోరీ చేశారు.

సంఘటన స్థలాన్ని జాగిలాలతో, క్లూస్ టీం తో పరిశీలించారు. బాధితురాలు లత ఫిర్యాదు మేరకు ఎస్ఐ రమాకాంత్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. అనంతరం సోమవారం రాత్రి ఇదే గ్రామంలో వెంకటరమణ ఇంట్లోఇంటి పైకప్పు జాలి కోసి బంగారు ఆభరణాలు కొంత నగదు చోరీ చేశారు. సంఘటన స్థలాన్ని వేములవాడ రూరల్ సీఐ శ్రీనివాస్, ఎస్సై రమాకాంత్ పోలీసులు క్షుణ్ణంగా ఇంటిని పరిశీలించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

అనంతరం ప్రత్యేక పోలీసు బృందాలు నిందితుల కోసం అన్వేషిస్తున్న రు. ఈ విధంగా గ్రామంలో వరుసగా రెండు చోరీలు జరగడంతో గ్రామస్తులు భయంతున్నారు.

మరిన్ని వార్తలు