పంట నష్టం అంచనా వేసిన వ్యవసాయ శాఖ
ములకలపల్లి,(విజయక్రాంతి): మురసు తుఫాను వలన ములకలపల్లి మండలంలో నష్ట పోయిన పంట పొలాలను గురువారం పరిశీలించి గ్రామాల వారీగా ప్రాధమిక పంట నష్టాన్ని వ్యవసాయ అధికారులు అంచనా వేశారు.ములకలపల్లి మండలంలోని వివిధ గ్రామాలలో తుఫాను వలన నష్టపోయిన పంటలను పరిశీలించడం జరిగినది. వరి 1287,పత్తి 637,వేరుశనగ 366, మొక్కజొన్న 81 మినుములు 54 ఇతర పంటలు 13 ఎకరాలు మొత్తం కలిపి 1205 మంది రైతులకు చెందిన 2438 ఎకరాలలో పంటలకు నష్టం వాటిల్లినట్లు వ్యవసాయ శాఖ అధికారులు ప్రాథమికంగా గుర్తించారు.ఈ కార్యక్రమంలో అశ్వారావుపేట సహాయ వ్యవసాయ సంచాలకులు రవికుమార్, మండల వ్యవసాయ అధికారి అరుణ్ బాబు, వ్యవసాయ విస్తరణ అధికారులు రాహుల్ గాంధి, రమేష్, సుజాత,సూరిబాబు పాల్గొన్నారు.