రోడ్డు ప్రమాదంలో మత్స్య కార్మికుడు మృతి

05-11-2026 | 11:13pm

కోనరావుపేట,(విజయక్రాంతి): రోడ్డు ప్రమాదం(Road Accident)లో తీవ్రంగా గాయపడిన మత్స్య కార్మికుడు(Fisherman) చికిత్స పొందుతూ గురువారం మృతి చెందిన సంఘటన కోనరావుపేట మండల కేంద్రంలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. కోనరావుపేట మండల కేంద్రానికి చెందిన కూర జలంధర్ (58) బుధవారం చేపల విక్రయం కోసం వీర్నపల్లి మండల కేంద్రానికి వెళ్లారు. అక్కడి నుంచి తిరిగి వస్తుండగా మార్గమధ్యలో కారు ఢీకొనడంతో తీవ్రంగా గాయపడ్డారు. వెంటనే ఆయనను ఆసుపత్రికి తరలించి చికిత్స అందించగా, చికిత్స పొందుతూ గురువారం మృతి చెందారు. మృతుడికి భార్య వజ్రమ్మ, ఇద్దరు కుమారులు బాలస్వామి, దేవేందర్ లు ఉన్నారు. కుటుంబానికి పెద్దదిక్కును కోల్పోయిన బాధిత కుటుంబాన్ని ప్రభుత్వం ఆర్థికంగా ఆదుకోవాలని మండల మత్స్య కార్మికుల సంఘం అధ్యక్షుడు కూర బాబు ప్రభుత్వాన్ని కోరారు.

మరిన్ని వార్తలు