విశ్రాంత పిహెచ్ఎన్ మృతి
ములకలపల్లి, నవంబర్ 11 (విజయక్రాంతి): ములకలపల్లి మండలంలోని మారుమూల గిరిజన గ్రామాల్లో 1985 నుంచి 2005 వరకు విశేష వైద్య సేవలందించిన విశ్రాంత పబ్లిక్ హెల్త్ నర్స్ (Public Health Nurse) గోరిజవోలు లక్ష్మి(83) బుధవారం మృతి చెందారు. ఆమె గత కొంతకాలం నుంచి వృద్ధాప్య సమస్యలతో బాధపడుతున్నారు. వారం రోజుల క్రితం తీవ్ర అనారోగ్యానికి గురి కావడంతో ఆమెను కుటుంబ సభ్యులు ఖమ్మంలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి చేర్పించారు.
అక్కడ చికిత్స పొందుతూ బుధవారం మృతి చెందారు. ఆమెకు ఇద్దరు కొడుకులు, ఓ కూతురు ఉన్నారు.ఆమె మృతి సమాచారం తెలుసుకున్న ములకలపల్లి మండలంలోని పలువురు ప్రముఖులు ఆమె మృత దేహాన్ని సందర్శించి నివాళులర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అంతగా వైద్య సేవలు అందుబాటులో లేని సమయంలో ఆమె గ్రామీణ ప్రాంత ప్రజలకు విశేషమైన సేవలు అందించారని కొనియాడారు.