గోదావరి పుష్కరాల కొరకు ఏర్పాట్ల పరిశీలన
సంబంధిత ఇంజనీరింగ్ అధికారులతో పుష్కరాలు జరిగే పరిసరాలను పరిశీలించిన సబ్ కలెక్టర్ మృనాల్ శ్రేష్ట
భద్రాచలం టౌన్ (విజయక్రాంతి): వచ్చే సంవత్సరం జరిగే గోదావరి పుష్కరాల సందర్భంగా దేశ నలుమూలల నుండి శ్రీ సీతారామ చంద్రస్వామి కొలువైయున్న భద్రాచలంకు భక్తులు తండోపతండాలుగా వచ్చే అవకాశం ఉన్నందున వారికి సకల సౌకర్యాలు కల్పించడానికి ఇప్పటి నుండే సౌకర్యాలు ఏర్పాట్ల కొరకు ముఖ్యమైన స్థలాలను పరిశీలించడం జరిగిందని భద్రాచలం సబ్ కలెక్టర్ మృనాల్ శ్రేష్ట(Sub Collector Mrunal Shrestha) అన్నారు.
మంగళవారం ఆర్ అండ్ బి ఏఈఈ, ఈవో గ్రామపంచాయతీ సంబంధిత అధికారులతో కలిసి గోదావరి పుష్కరాలకు వచ్చే భక్తులు ఎటువంటి ఇబ్బందులు పడకుండా ప్రశాంతంగా గోదావరిలో స్నానాలు చేసి శ్రీ సీతారామచంద్ర స్వామి వారి దర్శనం చేసుకొని వారి గమ్యస్థానాలకు సురక్షితంగా చేరుకునేలా సౌకర్యాలు కల్పించుటకు ముఖ్యమైన స్థలాలను, రోడ్డు మార్గాలను పరిశీలించడం జరిగిందనన్నారు.
పుష్కరాలకు వచ్చే భక్తులు భద్రాచలం సురక్షితంగా చేరుకొని శ్రీ సీతారామచంద్ర స్వామి వారి దర్శనం చేసుకొని వెళ్లడానికి ఆలయం చుట్టూ ఉన్న వివిధ రోడ్డు మార్గాలను( ఎన్ హెచ్-30 నుంచి గోదావరి ఘాటుల వైపు వెళ్లే రహదారి కరకట్ట రోడ్డు చట్ట దిగువ రహదారి అన్నదాన సత్రం ప్రాంతం) లను సంబంధిత ఇంజనీరింగ్ అధికారులతో ఆయన పరిశీలించారు. త్వరలో పనులు ప్రారంభించి పుష్కరాలకు వచ్చే భక్తుల కొరకు బస్సు చేయడానికి అన్ని మౌలిక వసతులు కల్పించడానికి ప్రణాళికలు రూపొందిస్తామని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో ఆర్ అండ్ బిఏఈఈ శ్రవణ్ కుమార్, తహసిల్దార్ రవికుమార్, జిపిఈఓ శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.