'బోర్ వెల్స్'పై సడలింపు ఇవ్వాలి
ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్కకు బోర్ వెల్స్ వ్యాపారుల వినతి
ఎల్బీనగర్, నవంబర్ 3: ఎల్ నీనో ప్రభావంతో రాష్ట్రంలో ఏర్పడిన కరువుతో ప్రభుత్వం బోర్ తవ్వకాలపై కఠిన నిర్ణయాలు తీసుకుందని, దీంతో బోర్ వైల్స్ పై ఆధారపడి అనేక కుటుంబాలు పస్తులు ఉండే పరిస్థితులు నెలకొన్నాయని, బోర్ తవ్వకాలపై ప్రభుత్వం సడలింపులు ఇవ్వాలని బోర్ వెల్స్ వ్యాపారులు పేర్కొంటున్నారు. ఈ మేరకు మంగళవారం డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క(Deputy CM Bhatti Vikramarka)ని ఆయన కార్యాలయంలో కలిసి వినతిపత్రం అందజేశారు.
ఈ సందర్భంగా బోర్ వెల్స్ వ్యాపారులు మాట్లాడుతూ.. బోర్ వెల్ వ్యవస్థపై ఆధారపడిన కుటుంబాల భవిష్యత్తును కాపాడాలని కోరారు. అసెంబ్లీలో బోర్ వెల్స్ సమస్యలపై చర్చించి పరిష్కార దిశగా కృషి చేస్తానని డిప్యూటీ సీఎం హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో బోర్ వెల్స్ అసోసియేషన్ గ్రేటర్ హైదరాబాద్ అధ్యక్షుడు ముసుకు అంజి రెడ్డి, గౌరవాధ్యక్షుడు సుధాకర్ రెడ్డి, జనరల్ సెక్రెటరీ నర్సిరెడ్డి, ఉపాధ్యక్షుడు జంగయ్య గౌడ్, ఆర్గనైజింగ్ సెక్రెటరీ నక్కల శ్రీనివాస్ యాదవ్, శ్రీనివాస్ రెడ్డి, లక్ష్మీనారాయణ, శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.