లక్ష్మీపూర్‌లో ఇనుప సామగ్రి దుకాణంలో అగ్నిప్రమాదం

03-11-2026 | 11:46pm

తంగళ్లపల్లి, నవంబర్ 3 (విజయక్రాంతి): రాజన్న సిరిసిల్ల జిల్లా(Rajanna Sircilla district) తంగళ్ళపల్లి మండలం లక్ష్మీపూర్ శివారులోని ఇనుప సామగ్రి దుకాణంలో షార్ట్‌సర్క్యూట్‌తో అగ్నిప్రమాదం సంభవించింది. మంటలు వ్యాపించడంతో ప్లాస్టిక్ సామగ్రి పూర్తిగా దగ్ధమైంది. లక్షల రూపాయల ఆస్తి నష్టం జరిగినట్లు సమాచారం. ఘటనా స్థలానికి చేరుకున్న ఫైర్ సిబ్బంది మంటలను అదుపులోకి ప్రయత్నిస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

మరిన్ని వార్తలు