పట్టభద్రులంతా ఓటరుగా నమోదు చేసుకోవాలి
కాంగ్రెస్ అభ్యర్థి రాంరెడ్డి సర్వోత్తమ్ రెడ్డిని గెలిపించాలి
డీసీసీ కార్యదర్శి వేల్పుల రమేష్
జాజిరెడ్డిగూడెం(అర్వపల్లి): వరంగల్-ఖమ్మం-నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ నియోజకవర్గ పరిధిలోని అర్హులైన పట్టభద్రులందరూ ఓటరుగా నమోదు చేసుకోవాలని డీసీసీ కార్యదర్శి వేల్పుల రమేష్(DCC Secretary Velpula Ramesh) పిలుపునిచ్చారు. మంగళవారం ఆయన మాట్లాడుతూ, ఉన్నత విద్య అభ్యసించిన పట్టభద్రులు ప్రజాస్వామ్య ప్రక్రియలో చురుకుగా పాల్గొనాలన్నారు.
అర్హత కలిగిన వారు నిర్లక్ష్యం చేయకుండా అవసరమైన ధ్రువపత్రాలతో నిర్ణీత గడువులోగా ఓటరుగా నమోదు చేసుకోవాలని కోరారు.పట్టభద్రుల సమస్యలు,హక్కులు,ఆకాంక్షలకు శాసనమండలిలో తగిన ప్రాతినిధ్యం కల్పించేందుకు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి రాంరెడ్డి సర్వోత్తమ్ రెడ్డిని భారీ మెజార్టీతో గెలిపించాలని ఈ సందర్భంగా ఆయన విజ్ఞప్తి చేశారు. యువ పట్టభద్రులు ముందుకు వచ్చి తమ పేర్లను నమోదు చేసుకోవడంతో పాటు ఇతర అర్హులకు కూడా అవగాహన కల్పించాలన్నారు.