చరిత్ర శోధకుడు సంగిశెట్టి

02-11-2026 | 05:05am

చరిత్ర అంటే రాజుల విజయగాథలు, రాజ్యాధికారాల రికార్డులే కాదు.. సమాజ నిర్మాణంలో భాగమైన సామాన్యుల జీవన పోరాటం, అణగారిన వర్గాల ఆత్మగౌర వం, వెలుగులోకి రాని జీవితాల సమాహారం. అటువంటి విస్తృత చరిత్రకు అక్షర రూపమిస్తూ, మరుగునపడిన సామాజిక ఉద్యమాలకు, సాహిత్య వారసత్వానికి వెలుగులు అద్దు తున్న అరుదైన పరిశోధకుడు డా. సంగిశెట్టి శ్రీనివాస్.

తెలంగాణ అస్తిత్వ చరిత్రను, దళిత బహుజన ఉద్యమాల చరిత్ర ను, సామాజిక సంస్కర్తల జీవితాలను పరిశోధనాత్మకంగా వెలికితీస్తూ తనదైన ముద్ర వేసుకున్న సాహితీవేత్త, చరిత్రకారుడు, విమర్శకుడు, సంపాదకుడు. సంగిశెట్టి శ్రీనివాస్ 1965 అక్టోబర్ 10న యాదాద్రి- భువనగిరి జిల్లా రాజాపేట మండలం, రఘునాథపురంలో వజ్రమ్మ, స్వామి దంపతులకు జన్మించారు.

హైదరాబాద్‌లోని బాబు జగ్జీవన్‌రామ్ కళాశాలలో ఇంటర్మీడియట్, భద్రుకా డిగ్రీ కాలేజీలో బీకాం పూర్తి చేశారు. ఉస్మానియా విశ్వవిద్యాలయం నుంచి కమ్యూనికేషన్ అండ్ జర్నలిజంలో మాస్టర్స్, లైబ్రరీ అండ్ ఇన్ఫ ర్మేషన్ సైన్స్ మాస్టర్స్, జర్నలిజంలో ఎంఫిల్, లైబ్రరీ సైన్స్ లో పీహెచ్‌డీ చేశారు.   

ఉద్యమ ప్రస్థానం: సంగిశెట్టి శ్రీనివాస్ 1990లో ఉస్మానియా విశ్వవిద్యాలయంలో తెలంగాణ స్టూడెంట్ ఫ్రంట్ స్థా పక సభ్యుడిగా విద్యార్థి ఉద్యమాల్లోకి ప్రవేశించారు. 1991 నవంబర్ 1న తెలంగాణ స్టూడెంట్ ఫ్రంట్ బాధ్యుడిగా ఆర్ట్స్ కళాశాలపై నల్లజెండా ఎగురవేసి బ్లాక్ డే నిర్వహణలో కీలకంగా ఉన్నారు.

క్రాంతి సంగ్రామ పరిషత్ ద్వారా 1990-- మధ్య విద్యార్థి ఉద్యమాల్లో పాల్గొన్నారు.  1990-- మధ్య ‘ఉదయం’ దినపత్రికలో జర్నలిస్టుగా పనిచేశారు. 1993 నుంచి 2012 వరకు ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో లైబ్రేరియన్‌గా, 2012 నుంచి ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో అసిస్టెంట్ ప్రొఫెసర్‌గా సేవలందించారు. 2016లో తెలుగు విశ్వవిద్యాలయంలో డిప్యూటేషన్‌పై పని చేస్తి ‘తెలంగాణ పదకోశం’ రూపకల్పనలో భాగస్వాములయ్యారు.

విస్మత చరిత్రల అన్వేషణ : శ్రీనివాస్ పరిశోధన ప్రస్థానంలో అత్యంత ప్రధానమైన అంశం చరిత్రను కింది నుంచి చూడటం. ‘తెలంగాణ సాయుధ పోరాటం ఒక సబాల్టర్న్ దృక్కోణం’, షబ్నవీస్ -- తెలంగాణ పత్రికా రంగ చరిత్ర, దమ్ --తెలంగాణ కథల సూచి, ‘హైదరాబాద్ సిర్ఫ్ హమారా, తెలంగాణ నవలా చరిత్ర, దుర్భిణి --తెలంగాణ సాహిత్య వ్యాసాలు, తెలంగాణ దళితోద్యమ చరిత్ర, ఇంగితం --దళిత సాహిత్య వ్యాసాలు, పుంజము --సబాల్టర్న్ సాహిత్యం, బీసీ కవిత్వ విశ్లేషణ వంటి రచనలు ఆయన పరిశోధన పరిధికి అద్దం పడుతాయి.

వట్టికోట ఆళ్వారుస్వామి, కొండా లక్ష్మణ్ బాపూజీ, మహాత్మా పూలే, సావిత్రిబాయి పూలే, డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్, గాజుల లక్ష్మీనర్సుశెట్టి, షోయబుల్లా ఖాన్, బి.పి. మండల్, త్యాగరాజ మొదలియార్, భాగ్యరెడ్డి వర్మ, సింగారవేలు వంటి చారిత్రక వ్యక్తుల జీవితాలను పరిచయం చేస్తూ వారి సామాజిక సేవలను, పోరాటాలను వర్తమాన తరాలకు అందించారు. ‘తెలంగాణ దళితోద్యమ చరిత్ర’ గ్రంథం తెలంగాణ సామాజిక పరిణా మాలను అర్థం చేసుకోవడానికి ఒక ముఖ్యమైన పరిశోధన ప్రయత్నం. 

సంపాదకుడిగా సాహిత్య పునరుజ్జీవనం

రచయితగానే కాకుండా సంపాదకుడిగానూ సంగిశెట్టి శ్రీనివాస్ చేసిన కృషి విశేషమైనది. మరుగునపడిన రచయితల రచనలను వెలికితీసి పుస్తకరూపంలో అందించడం ఆయన సాహిత్య సేవలో మరో ముఖ్యమైన కోణం. ఆవుల పిచ్చయ్య కథలు, భండారు అచ్చమాంబ కథలు, సురవరం కవిత్వం, రామప్ప రభస, సురమౌళి కథలు, కేవల్ కిషన్ జీవితచరిత్ర, బొమ్మ హేమాదేవి కథలు, మాదిరెడ్డి సులోచన కథలు, తొలి తెలుగు వచన కావ్యం ‘మహైక’, ‘తొలికారు’ తెలంగాణ ఆధునిక కవిత్వం వంటి అనేక గ్రంథాలకు సంపాదకత్వం వహించారు.

తెలంగాణ కథా సాహిత్యానికి సంబం ధించిన రంది, తన్లాట, అలుగు, కూరాడు, దావత్, రివాజు, రూబిడి, బుగులు, నెనరు, దురస్తు వంటి కథా సంకలనాల రూపకల్పనలో సహ సంపాదకుడిగా డా.వెల్దండి శ్రీధర్‌తో భాగస్వాములయ్యారు. తెలంగాణ చారిత్రక పత్రాలు,

1969 తెలంగాణ ఉద్యమ కవిత్వం, తెలంగాణ దళిత కథలు, తెలంగాణ సాహిత్య చరిత్ర వంటి పలు ముఖ్యమైన గ్రంథాల రూపకల్పనలోనూ తనదైన ముద్ర వేశారు సంగిశెట్టి. ‘దిక్కార’, ‘ధిక్కార’ మహాత్మా జోతిరావు ఫూలే స్ఫూర్తి కవిత్వం కవితా సంకలనం రూపకల్పనలో వనపట్ల సుబ్బయ్యతో కలిసి పనిచేయడం కూడా ఆయన సాహిత్య ప్రయా ణంలో ఒక ప్రత్యేకమైన అంశం.

సంస్థల నిర్మాణంలోనూ ముందడుగు

సాహిత్య, చారిత్రక, సామాజిక సంస్థల నిర్మాణంలోనూ సంగిశెట్టి శ్రీనివాస్ కీలక పాత్ర పోషించారు. 2004లో ‘కవిలె’ తెలంగాణ రీసెర్చ్ అండ్ రెఫరల్ సెంటర్ స్థాపన, 2006లో ముల్కీ స్టడీ సెంటర్ ఏర్పాటు, 2007లో ‘సింగిడి’ తెలంగాణ రచయితల సంఘం నిర్మాణం, 2009లో తెలంగాణ హిస్టరీ సొసైటీ, 2011లో తెలంగాణ ప్రచురణలు, 2014లో ఫోరమ్ ఫర్ కన్సర్న్ బీసీ, 2022లో ‘సవహ’ రచయితల సంఘం,

2025 లో తెలంగాణ పరిరక్షణ వేదిక, 2026లో బీసీ సాహిత్య వేదిక వంటి సంస్థల నిర్మాణంలో ఆయన భాగస్వామ్యం సామాజిక నిబద్ధతకు నిదర్శనం. సింగిడి, సబాల్టర్న్, సవహ పత్రికల సంపాదకత్వం ద్వారా సాహిత్య, సామాజిక చర్చలకు వేదిక కల్పించారు.

పాఠ్య ప్రణాళిక కమిటీలో సభ్యుడిగా..

తెలంగాణ పాఠ్య ప్రణాళిక నిర్ణాయక కమిటీలో 2014 మధ్యలో సభ్యుడిగా పని చేయడంతో పాటు తెలంగాణ ఆధునిక సాహిత్య చరిత్ర, తెలంగాణ సమగ్ర సాహిత్య చరిత్ర వంటి పాఠ్యగ్రంథాల రచనలో భాగస్వాములయ్యారు. వం దకు పైగా పుస్తకాలకు ముందుమాట రాశారు. వివిధ విశ్వవిద్యాలయాలు, కళాశాలల్లో 50కి పైగా పరిశోధన పత్రాలు సమర్పించారు. అంతేకాకుండా తెలంగాణ సాంస్కృతిక శాఖ సలహామండలి సభ్యుడిగానూ సంగిశెట్టి సేవలందిస్తున్నారు.

భాషా సాహిత్య ఆసక్తికి నిదర్శనం

సంగిశెట్టి సాహిత్యం సృజనాత్మక వ్యక్తీకరణే కాదు. అది చరిత్రను తిరగరాసే సాధనం. సమాజంలో అణచివేతకు గురైన వర్గాల ఉనికిని గుర్తించే ప్రయత్నం. ఆధిపత్య భావజాలాన్ని ప్రశ్నించే ఆలోచనా వేదిక. మరచిపోయిన మను షులను గుర్తు చేయడం, మరుగునపడిన ఉద్యమాలకు చరిత్రలో స్థానం కల్పించడం, అట్టడుగు వర్గాల సాహిత్యాన్ని వెలికితీయ డం ఆయన పరిశోధనలోని అంతర్ సూత్రం. అందుకే ఆయన రచనల్లో చరిత్ర, పోరాటం, సా మాజిక న్యాయ ఆకాంక్ష ఉంది. 

 వ్యాసకర్త సెల్: 9492765368

పురస్కారాలు, గుర్తింపులు

సాహిత్య, పరిశోధన రంగాల్లో ఆయన చేసిన కృషికి అనేక పురస్కారాలు లభించాయి. తెలుగు విశ్వవిద్యాలయం కీర్తి పురస్కారం (2015), తెలంగాణ రాష్ట్ర ప్రభు త్వ ఉత్తమ సాహితీవేత్త అవార్డు (2016), జాషువా అవార్డు (2016), కళాశాల విద్యాశాఖ ఉత్తమ లైబ్రేరియన్ అవార్డు (2016), మహాత్మా పూలే సాంస్కృతిక అవార్డు (2019), భాగ్యరెడ్డివర్మ జీవన సాఫల్య పురస్కారం (2025), సురవరం ప్రతాపరెడ్డి స్మారక పుర స్కారం (2025) ఆయన ప్రతిభకు గుర్తింపులు. దుర్భి ణి, సవారు గ్రంథాలకు విమర్శ సాహితీ విభాగంలో పురస్కారాలు అందుకున్నారు.

అమీర్ అజీజ్ రాసిన ‘సబ్ యాద్ రకేంగే’ ఉర్దూ కవితను ‘అంతా యాదికుంచుకుంటాం’ పేరుతో తెలుగులోకి అనువదించడం ఆయన భాషా సాహిత్య ఆసక్తికి మరో నిదర్శనం. తెలంగాణ వికాస సమితి ఆధ్వర్యంలో ఈనెల 3వ తేదీన మల్లా వఝల సదాశివుడి స్మారక పురస్కారాన్ని అం దుకోనున్న సందర్భంగా.. సంగిశెట్టి శ్రీనివాస్‌కు అభినందనలు తెలియజేస్తున్నా. మున్ముందు కూడా తన ప్రస్థానాన్ని విజయవంతంగా కొనసాగిస్తూ మరెన్నో అవార్డులు అందుకోవాలని ఆకాంక్షిస్తున్నా.


మరిన్ని వార్తలు