కలల మిస్సుల్ కలామ్

15-10-2026 | 05:00am

నేడు కలామ్ జయంతి :

కలలు కనండి వాటిని నిజం చేసుకోండి అని చెప్పిన గొప్ప సైంటిస్ట్ ఏపీజే అబ్దుల్ కలామ్(Scientist APJ Abdul Kalam). మీరు చేసిన తప్పులే మీకు ఉత్తమ గురువులు. హృదయంలో నిజాయితీ ఉన్నప్పుడు ఆ అందం వ్యక్తిత్వంలో కనపడుతుంది. మీ అపజయాలను తప్పటడుగులు అనుకోవద్దు.. భవిషత్తులో మీరేం చేయకూడదో తెలిపే పాఠాలు.. ఇలాంటి వేలాది సూక్తులు చెప్పి దేశానికే గర్వకారణంగా నిలిచిన ఆదర్శ రాష్ట్రపతి కలామ్. 1931 అక్టోబరు 15న జన్మించారు. భారత 11వ రాష్ట్రపతి, క్షిపణి శాస్త్రవేత్త(Missile scientist). పూర్తిపేరు అవుల్ పకీర్ జైనులబుద్దీన్ అబ్దుల్ కలామ్.

తమిళనాడు(Tamil Nadu) లోని రామేశ్వరంలో పుట్టి పెరిగారు. తిరుచిరాపల్లి(Tiruchirappalli) లోని సెయింట్ జోసెఫ్ కళాశాలలో భౌతికశాస్త్రం అభ్యసించారు. చెన్నైలోని మద్రాస్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టె క్నాలజీ కళాశాల నుంచి ఏరోస్పేస్ ఇంజనీరింగ్(Aerospace Engineering) పట్టాపొందారు. రాష్ట్రపతి పదవికి ముందు, రక్షణ పరిశో ధన అభివృద్ధి సంస్థ, భారతీయ అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో-) లో ఇంజనీర్‌గా పనిచేశారు. భారతదేశపు మిస్సైల్ మ్యాన్‌గా పేరుగాం చారు. కలామ్ ముఖ్యంగా బాలిస్టిక్ క్షిపణి, ప్రయోగ వాహన సాంకేతికత అభివృద్ధికి కృషిచేశారు.

1998లో భారతదేశ పోఖ్రాన్- అణు పరీక్షలలో కీలకమైన, సంస్థాగత, సాంకేతిక, రాజకీయ పాత్ర పోషించారు. 2002 రాష్ట్రపతి ఎన్నికలలో బీజేపీ అతన్ని అభ్యర్థిగా ప్రతిపాదించగా, ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీ మద్దతు తెలిపింది. ఆ ఎన్నికలలో వామపక్షాలు బలపరిచిన లక్ష్మీసెహగల్‌పై గెలిచారు. కలామ్ తన పుస్తకం ఇండియా  2020 నాటికి భారత్‌ను ఒక అభివృద్ధి చెందిన దేశంగా మార్చడానికి ప్రణాళికలు సూచించారు. భారత అత్యున్నత పౌర పురస్కారమైన భారతరత్నతో సహా అనేక ప్రతిష్ఠాత్మక అవార్డులు అందుకున్నారు.

2012లో ది హిస్టరీ ఛానల్, రిలయన్స్ మొబైల్ భాగస్వామ్యం తో అవుట్ లుక్ మ్యాగజైన్ నిర్వహించిన ‘ది గ్రేటెస్ట్ ఇండియన్ పోల్’లో రెండవ స్థానంలో ఎంపికయ్యారు. ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్‌మెంట్, షిల్లాంగ్‌లో ఉపన్యాసం ఇస్తున్నప్పుడు, కలామ్ కుప్పకూలిపోయారు. 2015 జూలై 27న, 83 ఏళ్ల వయసులో, గుండెపోటుతో మరణించారు. తన స్వస్థలం రామేశ్వరంలో జరిగిన అంత్యక్రియలకు ప్రముఖులతో సహా వేలాది మంది హాజరయ్యారు.  

చిన్నతనం నుంచీ కష్టజీవే!

తండ్రి జైనులబుద్దీన్, తల్లి ఆషియమ్మ గృహిణి. పేద కుటుంబం కావటంతో కుటుంబ అవసరాల కోసం కలామ్ చిన్న వయసులోనే పని చేయ డం ప్రారంభించారు. పాఠశాల విద్య పూర్తి చేసిన తర్వాత, తన తండ్రికి చేదోడువాదోడుగా ఉండటానికి వార్తా పత్రికలు పంపిణీ చేసేవారు. రామనాథపురం స్క్వారట్జ్ మెట్రిక్యులేషన్ స్కూల్ లో తన పాఠశాల విద్య పూర్తి చేశాక, కలామ్ తిరుచిరాపల్లి లోని సెయింట్ జోసెఫ్స్ కళాశాలలో చేరి, 1954 లో భౌతికశాస్త్రంలో పట్టా పొందారు.

అప్పట్లో ఈ కళాశాల మద్రాస్ విశ్వవిద్యాలయం అనుబంధ సంస్థగా ఉండేది. ఈ కోర్సుపై అతనికి కోర్సు పూర్తి అయ్యేవరకు మక్కువ కలగలేదు.  1955 లో మద్రాసులో ఏరోస్పేస్ ఇంజనీరింగులో చేరారు. కలామ్ సీనియర్ తరగతి ప్రాజెక్ట్ పనిచేస్తుండగా, పురోగతి లేకపోవడంతో డీన్ అసంతృప్తి చెంది ప్రాజెక్ట్ తదుపరి మూడు రోజు ల్లో పూర్తి చే యకపోతే తన ఉపకారవేతనం రద్దుచేస్తానని బెదిరించాడు. ఇచ్చిన గడువులో క ష్టపడి పని పూర్తిచేసి డీన్‌ను ఆకట్టుకున్నారు కలామ్. 

కామిడి సతీష్ రెడ్డి

 వ్యాసకర్త సెల్: 9848445134  

మరిన్ని వార్తలు