కాషాయం కోటలో ‘ఇండీ’ పాగా !

05-11-2026 | 05:05am

ప్రొ. సంగని మల్లేశ్వర్ :

ప్రజాస్వామ్యంలో ఎన్నికల ఫలితాలు(Election results) కేవలం గెలుపోటములకు సంబంధించినవి మాత్రమే కావు. అవి ప్రజల ఆలోచనల్లో వస్తున్న మార్పులకు, పాలకులపై పెరుగుతున్న అసంతృప్తికి, ప్రత్యామ్నాయ రాజకీయ శక్తుల ఎదుగుదలకు సంకేతాలు. ఇటీవల నాలుగు రాష్ట్రా ల్లో వెలువడిన 28 ఎమ్మెల్సీ(MLC) స్థానాల ఎన్నికల ఫలితాలు దేశవ్యాప్తంగా ఆసక్తి రేకెత్తిస్తు న్నాయి.

కాషాయ పార్టీకి కంచుకోటలుగా భావిస్తున్న ప్రాంతాల్లో ప్రతిపక్షాలు సాధించిన విజయాలు దేశ రాజకీయాల్లో మారు తున్న సమీకరణాలకు అద్దం పడుతున్నాయి. ప్రధాని నరేంద్ర మోదీ(Narendra Modi) ప్రాతినిథ్యం వహిస్తున్న వారణాసిలో బీజేపీకి(BJP) ఎదురైన పరాజయం, నాగపూర్ వంటి ఆర్‌ఎస్‌ఎస్ రాజకీయ కేంద్రంలో ప్రతిపక్షాల పోటీ, ఉత్తరప్రదేశ్‌లో సమాజ్‌వాదీ పార్టీ సాధించిన విజయాలు బీజేపీకి హెచ్చరికలుగా నిలుస్తున్నాయి. అధికారమే శాశ్వతం కాదని, ప్రజాభిప్రాయమే అంతిమమని ఈ ఫలితాలు మరోసారి నిరూపించాయి.

మోదీకి ప్రతిష్ఠగా వారణాసి!

వారణాసి అనేది కేవలం ఒక లోక్‌సభ నియోజకవర్గం కాదు. అది మోదీ రాజకీయ ప్రతిష్ఠకు ప్రతీకగా బీజేపీ ప్రచారం చేసుకుంటున్న ప్రాంతం. అలాంటి ప్రాం తంలో ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఎదురైన ఓట మి రాజకీయంగా ప్రాధాన్యం సంతరించుకుంది. నాగపూర్, ఆగ్రా, ప్రయాగరాజ్ వంటి ప్రాంతాల్లోనూ బీజేపీకి ఎదురవుతున్న సవాళ్లు ఆ పార్టీ నాయకత్వం ఆత్మ పరిశీలన చేసుకోవాల్సిన అవసరాన్ని సూచిస్తున్నాయి.

అయోధ్యలో రామమందిర నిర్మాణం, హిందుత్వ రాజకీయాలు, కుల గణన, జాతీయవాద నినాదాలతో ఎన్నికల ప్రయోజనం పొందిన బీజేపీకి ఇప్పుడు నిరుద్యోగం, ధరల పెరుగుదల, యువతలో అసంతృప్తి, పరీక్షల పేపర్ లీకేజీలు వంటి వాస్తవ సమస్యలు ఎదురవు తున్నాయి. భావోద్వేగ రాజకీయాల కంటే బతుకుదెరువు సమస్యలే ప్రజలకు ముఖ్యమని ఈ పరిణామాలు చెబుతున్నాయి.

చావుతప్పి కళ్లు లొట్టబోయినట్టు!

పుష్కర సమయంలో మాకు తిరుగులేదని విర్రవీగిన బీజేపీ కర్నాటకలో 3 స్థానా లను జేడీఎస్ 1స్థానం సాధించి స్వీప్ చే యడం మినహా ఆ పార్టీ వెన్నెముక అయి న ఆర్‌ఎస్‌ఎస్ కంచుకోట నాగపూర్‌లో కాంగ్రెస్ బోణి చేసి చరిత్ర సృష్టించింది. ఇక మహాయుతి కేవలం రెండు  స్థానాలను గెలవగలిగింది తప్ప ఇండీ కూటమి ని నిలువరించలేకపోయింది. అధికారంలో ఉన్న బిహార్‌లో ఎన్డీఏ కూటమి పేలవంగా 3 స్థానాలకే పరిమితమైంది. కేంద్ర ప్రభుత్వానికి గుండెకాయ లాంటి ఉత్తరప్రదేశ్‌లో 11 స్థానాలలో బీజేపీ 6 స్థానాలను గెలుచుకోగలిగింది.

ఇక్కడ 5 స్థానాల్లో స మాజ్‌వాదీ పార్టీ విజయదుందుభి మోగించింది. వాటిలో స్వయాన ప్రధాని మోదీ లోక్‌సభ నియోజకవర్గం వారణాసిలోని రెండు ఎమ్మెల్సీ స్థానాలనూ సమాజ్‌వాదీ పార్టీ గెలుచుకోవడమే బీజేపీ జీర్ణించుకోవడం లేదు. వారణాసి నుంచి నాగపూర్ దాకా ఎమ్మెల్సీ  ఎన్నికల్లో బీజేపీ ఓడిపోవడం చూస్తే మోడీ గ్రాఫ్ పడిపోతున్నద నేది స్పష్టంగా కన్పిస్తున్నది. ఇండీ కూటమి జాతీయ స్థాయిలో ప్రచారాంశంగా మార్చే అవకాశం లేకపోలేదు.

ప్రధానిగా మోదీ వారణాసిని బాగా అభివృద్ధి చేశామని నిజంగా చేసినా, ఢిల్లీ కేంద్రంగా నీట్ పరీక్షపై జరిగిన నిరసనలు, కొంతకాలంగా ఓట్ చోరీపై జరుగుతున్న ర్యాలీలు, కులగణనలో ఓబీసీ కాలంపై స్పష్టత లేకపోవ డం ప్రత్యర్థులకు బాగా కలసివచ్చింది. వాటి ఫలితమే బీజేపీని ఇరకాటంలో పడేసిందనే చెప్పాలి.

ఓట్ చోరీపై ఢిల్లీ కేంద్రం గా ఉద్యమాలు చేస్తున్న డీకే శివకుమార్ ప్రాతినిథ్యం వహిస్తున్న కర్నాటకలో ఒక్క సీటూ గెలవకపోవడం కూడా కాంగ్రెస్ పార్టీకి నష్టమే. ఇక కొద్ది నెలల్లో ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్, పంజాబ్‌లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఆ నాలు గు రాష్ట్రాల ఎమ్మెల్సీ ఫలితాలు కాంగ్రెస్ పార్టీకి జవసత్వాలు నింపాయంటే అతిశయోక్తి కాదు.

మేకపోతు గాంభీర్యం..!

ఎవరిది వారికీ అగుపడదు అన్నట్లు మోడీ కాంగ్రెస్ గెలవలేదు కదా? అని వ్యంగ్యాస్త్రాలు దేనికి నిదర్శనం.. అయినా ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలను లోక్‌సభ లేదా అసెంబ్లీ ఎన్నికల ఫలితాలకు నేరుగా సమానంగా చూడలేం. అయితే వాటిలో కనిపిస్తున్న రాజకీయ సంకేతాలను విస్మరించలేం. బీజేపీకి ఎదురవుతున్న సవాళ్లు, ప్రతిపక్షాలకు లభిస్తున్న అవకాశాలు భవిష్యత్తు రాజకీయాలకు కీలక సూచనలు చేస్తున్నాయి.

నీట్ పరీక్షల అవకతవకలు, నిరుద్యోగం, యువత భవిష్యత్తు, రైతుల ఆదాయం, ధరల భారం, రాజ్యాంగ సంస్థ ల స్వతంత్రత వంటి అంశాలపై ఇండీ కూటమి నిరంతరం ప్రజల్లోకి వెళ్లాలి. కేవలం ఎన్నికల సమయంలోనే కనిపించే కూటమిగా కాకుండా ప్రజల పక్షాన నిలిచే రాజకీయ ప్రత్యామ్నాయంగా ఎదగాలి. మోదీ పాలనపై ప్రజల్లో ఉన్న అసంతృప్తిని రాజకీయ ప్రయోజనంగా మలుచుకో వాలంటే ప్రతిపక్షాలు తమ మధ్య విభేదాలను పక్కనపెట్టాలి. రాహుల్‌గాంధీ నాయ కత్వంలో జాతీయ స్థాయి పోరాటాన్ని బ లోపేతం చేస్తూనే ప్రాంతీయ నాయకత్వాలకు తగిన ప్రాధాన్యతనివ్వాలి. 

ప్రజాతీర్పే అంతిమం!

ముగింపుగా ఒక్కటే మాట.. కాషాయ కోటలు బీటలు వారుతున్నాయా లేదా అన్నది రాబోయే ఎన్నికలు తేలుస్తాయి. కానీ ప్రజాస్వామ్యంలో ఏ కోటా శాశ్వతం కాదు. ప్రజల సమస్యలను పట్టించుకోని పాలకులకు ప్రజలే సమాధానం చెబుతారు. ఆ ప్రజా తీర్పును సాధించాలంటే ఇండియా కూటమి ఐక్యత, సమష్టి నాయకత్వం, ప్రజా పోరాటాలే అసలైన ఆయు ధాలు. మోదీకి ప్రత్యామ్నాయం కావాలంటే నినాదాలు కాదు.. ప్రజల విశ్వా సాన్ని గెలుచుకునే కార్యాచరణ కావాలి. కాషాయ కోటల్లో ఇండీ కూటమి జెండా ఎగరాలంటే ఇదే సరైన సమయం, ఇక దూకుడు పెంచాల్సిందే.

పోరాటలే మార్గంగా..

దేశంలో ప్రతిపక్ష రాజకీయాలకు రా హుల్ గాంధీ కొత్త దిశ చూపిస్తున్నారనడంలో సందేహం లేదు. ఓటు హక్కు పరిరక్షణ, ఎన్నికల వ్యవస్థలో పారదర్శకత, రాజ్యాంగ పరిరక్షణ, సామాజిక న్యాయం వంటి అంశాలను జాతీయ చర్చలోకి తీసుకొచ్చారు. అయితే రాహుల్ నాయ కత్వం పై పెరుగుతున్న ప్రజాభిమానాన్ని ఎన్నికల విజయాలుగా మార్చుకోవడం ఇండీ కూటమి ముందున్న ప్రధాన బాధ్యత. కేవలం ఓట్ చోరీ ఉద్యమానికే పరిమితం కాకుండా నిరుద్యోగం, రైతుల సమస్యలు, విద్య, వైద్యం, ఆర్థిక అసమానతలు, సామాజిక న్యాయం వంటి అంశాలపై నిరంతర పోరాటం చేయాలి.

ప్రజల సమస్య లపై క్షేత్రస్థాయిలో పోరాడినప్పుడే నాయకత్వంపై విశ్వాసం ఓట్ల రూపంలో వ్యక్తమ వుతుంది. రాహుల్ గాంధీ చేపడుతున్న రాజ్యాంగ పరిరక్షణ ఉద్యమానికి ఇండి యా కూటమి పాలిత రాష్ట్రాల ప్రభుత్వాలు, ప్రాంతీయ పార్టీలు మరింత బలాన్ని చేకూర్చాలి. బీజేపీని ఓడించాలంటే ప్రతిపక్షాల మధ్య ఐక్యత అత్యంత అవసరం. ఉత్తరప్రదేశ్లో సమాజ్వాదీ పార్టీ, పశ్చిమ బెంగాల్లో తృణమూల్ కాంగ్రెస్, తమిళనాడులో డీఎంకే, ఇతర రాష్ట్రాల్లో ప్రాంతీయ శక్తులు తమ రాష్ట్రాల రాజకీయ పరిస్థితులనుగుణంగా సమన్వయంతో ముందుకు సాగాలి.

ఎక్కడ బీజేపీ బలంగా ఉందో అక్కడ ప్రతిపక్ష ఓట్లు చీలకుండా చూడాలి. స్థానిక సమస్యలను జాతీయ రాజకీయాలతో అనుసంధానం చేయాలి. అభ్యర్థుల ఎంపిక నుంచి ప్రచారం వరకు సమష్టి వ్యూహాన్ని అమలు చేయాలి. ఎమ్మెల్సీ టీచర్, గ్రాడ్యుయేట్ ఎన్నికల ఫలితాలను పార్టీలు సాధారణంగా తీసుకుంటాయి కానీ, రాజకీయ పార్టీలకు ఆ యా ఫలితాలు సంజీవని లాంటివి అనేది నిర్వివాదాంశం. మోడీతో పోల్చుకుంటే నిరంతరం ప్రజల మధ్య ఉద్యమాలు చేస్తు న్న రాహుల్ పాపులారిటీ మునుపటికన్నా పెరిగిందని ’సీ’ ఓటర్ ట్రాకర్ సర్వే చెప్ప డం గమనార్హం. 

మరిన్ని వార్తలు