ఆరెకటికలను బీసీ ఏలో చేర్చాలి

08-11-2026 | 05:00am

డాక్టర్. ఎస్ విజయభాస్కర్:

తెలంగాణలో బీసీవర్గంలోని(Backward Class (BC) category) 38 కుల సంఘాల ఆత్మ గౌరవ భవనా లకు రూ.88.50 కోట్ల నిధులు మంజూరు చేయడం చారిత్రాత్మక నిర్ణ యం. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి(Revanth Reddy) సూచనల మేరకు బీసీ సంక్షేమశాఖ మంత్రి పొన్నం ప్రభాకర్(Ponnam Prabhakar) బీసీ సంక్షేమ ప్రభుత్వ సలహాదారు వీహెచ్ హన్మంతరావు, బీసీ సంక్షేమ శాఖ కమిషనర్ బాల మాయాదేవి, ఎం.పి. సురేష్ శెట్కర్, బీసీ  సంఘం జాతీయ అధ్యక్షులు జాజుల శ్రీనివాస్ గౌడ్ తదితరులు ఆత్మగౌరవ భవనాలకు కోటి యాభై లక్షల రూపాయల చెక్కులను పంపిణీ చేయడం బీసీల సంక్షేమం కోసం ప్రభుత్వం కట్టుబడి ఉం దని చెప్పడానికి చక్కటి నిదర్శనం. 

బీసీలలో అనేక కులాలకు కుల భవనాలు లేవని, బీసీ విద్యార్థులకు నైపు ణ్యాభివృద్ధి, వసతి సౌకర్యాలు, గ్రం థాలయాలు, సామాజిక కార్యక్రమాలు, కుల సంఘాల అభివృద్ధి, కుల సం ఘాల సమావేశాలకు ఈ భవనాలు ఎంతో ఉపయోగపడతాయని ఆనందం వ్యక్తమవుతోంది. ఈ భవనాలను హైదరాబాద్‌లోని ప్రైమ్ ఏరియాలైన ఉప్పల్, కోకాపేట్‌లలో ఎకరం నుండి ఐదు ఎకరాల వరకు భూములను గత ప్రభుత్వం కేటాయించింది. అయితే, నిధులు మంజూరు చేయకపోవడంతో ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్న చందంగా తయారైంది.

ఆ తర్వాత కాలంలో బీఆర్‌ఎస్ అధికారం కోల్పోవడం కాంగ్రెస్ పగ్గాలు చేపట్టడం జరిగిపోయాయి. రేవంత్ సర్కారు ఇందిరమ్మ ఇళ్లు కట్టిస్తున్న నేపథ్యంలో  బీసీ భవనాలను నిర్మాణానికి నిధులివ్వాలని కోరగా, ఒక్కో కులానికి లక్ష నుండి ఐదు లక్షల వరకు మంజూరు చేశారు.బీసీ కులాలలో వేరు వేరు గ్రూపులు ఉండడం తో అందరూ కలిసి ట్రస్ట్‌గా ఏర్పడి రావాలని ప్రభుత్వం సూచించింది. ఈ మేరకు ట్రస్ట్‌గా ఏర్పడిన నేతలు చెక్కులందుకున్నారు. అయితే, గత ప్రభు త్వం కేటాయించిన భూములను ఈప్రభుత్వం స్వాధీనం చేసుకుంటుందనే పుకార్లు వెల్లువెత్తుతున్నాయి. అలాంటిదేమీ లేదని మంత్రి పొన్నం ప్రభాకర్ కొట్టిపారేశారు.  

ఆరె కటికలను ఆదుకోండి:- రాష్ట్రంలోని ఆరె కటికలు ఆర్థికంగా, సామాజిక, రాజకీయ, విద్యాపరంగా, సాహిత్య, సాంస్కృతిక రంగాల్లో ఇంకా అనేక రంగాల్లో వెనుక బడి ఉన్నారని, తమను ఆదుకోవాలని ఆరె కటికలు కోరుతున్నారు.మన దేశానికి స్వాతంత్య్రం సిద్ధించి ఎనభై ఏండ్లు కావొస్తున్నా, తెలంగాణ ఏర్పడి పన్నెండేండ్లు దాటినా ఆరె కటికలకు ఇప్పటి వరకు చట్టసభల్లో అవకాశం రాలేదు. దీంతో తమ సమస్యలు పరిష్కారానికి నోచుకోవడం లేదని ఆవేదన చెందుతున్నారు. 

కనీసం హైదరా బాద్ మహానగరంలో గల కమేళాల్లో కూడా తమకు ప్రాధాన్యం లేదని వాపోతున్నారు.   రాష్ట్రంలో పది, పన్నెండు లక్షల మంది ఆరె కటికల జనా భా ఉన్నారు. అయితే, వివిధ జిల్లాల్లో ఒక్కో పేరుతో పిలుస్తుండడం వల్ల గణాంకాల్లో కొంత వ్యత్యాసాలు ఉన్నాయి.   ఇకపోతే, ఉత్తరాది రాష్ట్రాల్లో ఆరె కటికలు ఎస్సీ జాబితాలో కొనసాగుతున్నారు.  దీంతో ఆ రాష్ట్రాల్లో ఆరె కటికలకు పలు రంగాల్లో ప్రాధాన్యం దక్కుతోంది. తెలంగాణలో బీసీ డీ కేటగిరీలో ఉన్నారు.

దీంతో  ఎలాంటి రాజకీయ అవకాశాలు గానీ, ప్రభుత్వ ఉన్నత ఉద్యోగాల్లో అవకాశాలు గానీ రావడం లేదని ఆందోళన చెందుతున్నారు. గత ముఖ్యమంత్రి  కేసీఆర్ ఆరె కటికలను ఎస్సీ జాబితాలో చేరుస్తానని హామీ ఇచ్చినా నెరవేర్చలేదు.  అయితే, ఇతర రాష్ట్రా ల్లో ఆరెకటికలు ఎస్సీ జాబితాలో ఉంటే తెలంగాణలోనూ అమలు చేస్తామని ఎన్నికల సమ యంలో కాంగ్రెస్ హామీ ఇచ్చిందని గుర్తు చేస్తున్నారు. ఇప్పటికైనా ప్రభు త్వం స్పందించి ఆ హామీని నెరవేర్చా లని డిమాండ్ చేస్తున్నారు. ఆరె కటిక లను బీసీ డీ నుంచి బీసీ ఏ జాబితా లోకి మార్చాలని విజ్ఞప్తి చేస్తున్నారు.  

 వ్యాసకర్త : తెలంగాణ 

మహాజన రచయితల సమాఖ్య అధ్యక్షుడు,

9290826988

మరిన్ని వార్తలు