రాజగోపాల్ రెడ్డికి హైకమాండ్ ఫోన్

22-11-2026 | 05:15am

రేపు కాంగ్రెస్ వ్యవహారాల ఇంఛార్జీ సందీప్‌తో భేటీ

నవంబర్ 21 (విజయక్రాంతి): తెలంగాణ కాంగ్రెస్ రాజకీయా ల్లో కీలక పరిణామం చోటుచేసుకుంది. మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి(MLA Komatireddy Rajagopal Reddy) వ్యవహారంలో పార్టీ అధి ష్ఠానం స్పందించింది. ఈ నెల 23న రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల కొత్త ఇంఛార్జీ బీఎం సందీప్‌తో సమావేశం కావాలని హైకమాండ్ సూచించింది.

ఏఐసీసీ కార్యదర్శి సచిన్ సావంత్ స్వయంగా ఫోన్ చేసి రాష్ట్రంలోని తాజా రాజకీయ పరిణామాలపై ఆరా తీయడంతో పాటు, సందీ ప్‌తో భేటీకి అందుబాటులో ఉండాలని కోరినట్లు సమాచారం. ఇటీవల సీఎం రేవంత్ రెడ్డి, రాష్ట్ర ప్రభుత్వ పనితీరుపై రాజగోపాల్ రెడ్డి బహిరంగంగా విమర్శలు చేస్తున్న నేపథ్యంలో ఈ సమావేశం ప్రాధాన్యత సంతరించుకుంది. ఆయనకు మంత్రి పదవి దక్కుతుందా లేదా అన్న అంశంపై కాంగ్రెస్ వర్గాల్లో ఉత్కంఠ నెలకొంది.

ఈ నేపథ్యంలో ఆదివారం హైద రాబాద్‌కు రానున్న బీఎం సందీప్ సోమవారం రాజగోపాల్ రెడ్డితో ప్రత్యేకంగా సమావేశం కానున్నారు. ఈ భేటీలో తనకు ఎదురవుతున్న ఇబ్బందులు, ప్రభుత్వ పనితీరుపై ఉన్న అసంతృప్తిని సందీప్ దృష్టికి తీసుకెళ్లనున్నట్లు రాజగోపాల్ రెడ్డి వెల్లడించారు.

మరోవైపు తాను పార్టీ మారే ఆలోచనలో లేనని, రాహుల్ గాంధీని ప్రధానమంత్రిని చేయడమే తన లక్ష్యమని ఇప్పటికే స్పష్టంచేశారు. దీంతో సందీప్‌తో జరిగే భేటీలో ఎలాంటి చర్చలు జరుగుతాయి? రాజగోపాల్ రెడ్డి అసంతృప్తికి అధిష్ఠానం ఎలా స్పందిస్తుంది? అన్నది ఆసక్తికరంగా మారింది. కాంగ్రెస్ కొత్త ఇంఛార్జీ బీఎం సందీప్ ఆదివారం హైదరాబాద్‌కు చేరుకోనున్నారు. ఆయన రాక సందర్భంగా పార్టీ నాయకులతో విస్తృత స్థాయి సమావేశాలు ఏర్పాటు చేశారు.

 

మరిన్ని వార్తలు