కవిత్వానికి ముప్పు ఏండ్ల పండుగ
“ఉమ్మడిశెట్టి సాహితీ అవార్డు(Ummadisetti Sahiti Award)” ముప్పది ఏండ్ల చరిత్రను గమనిస్తే నిజం గా ఇది కవితా సౌభాగ్యశ్రీకి ఆలవాలమైనట్లు తేట పడుతుంది. (సౌభాగ్య మొదటి అవార్డు గ్రహీత, శ్రీసుధ 30వ అవార్డు గ్రహీత) ఈ అవార్డు మొదటిసారి 1988 లో సౌభాగ్యను వరించింది. ఆశ్చర్యం ఏమంటే మొదటి కవితా సంపుటి పేరు ‘కృత్యాద్యవస్థ’ కాని రాధేయగారు ‘ఉమ్మడిశెట్టి సాహితీ అవార్డు’ను స్థాపించినప్పు డు ఎలాంటి కృత్యాద్యవస్థకు లోను కాలే దు. పిడుగులు మీద పడ్డా, అడుగులు తడబడని అక్షరయోధుడు, ముచ్చటగా మూ డుపదుల కవితా సంపుటాలను అవార్డు తో కైసేసినాడు.
నాకు తెలిసినంతవరకు, ఏకధాటిగా క్రమం తప్పకుండా ప్రతియేటా పురస్కారాలిచ్చే సంస్థ తెలుగునాట లేదు. అదీ తానే ఒక సంస్థగా మారి, తండ్రిగారి పేరుమీద ప్రతి సంవత్సరం ఉత్తమ కవితా సంపుటికి పురస్కారాన్ని ప్రకటించడం మిత్రులు డా. రాధేయకే దక్కిన గౌరవం.
రాధేయ స్వతఃగా కవి. ఆ తర్వాతనే విమర్శకుడు. కవిత్వం లోతుపాతులు తెలిసిన విమర్శకుడు. సమాజంపట్ల కవిత్వం పట్ల విశ్వాసం కల్గిన సారస్వతమూర్తి! కవిగా తాను పురస్కృతుణి కావాలని అనుకునేవాళ్లే కాని, తోటి కవిని గౌరవించాలనే సంస్కారం ఎంతమందికుం టుంది? రాధేయ సాహిత్య సంస్కార వంతుడు. పురస్కార ప్రదాన కార్యక్రమా న్ని సంప్రదాయంగా పెట్టుకొని పెద్ద పెద్ద సాహిత్య సంస్థలకే ఆదర్శప్రాయుడైనాడు.
కవిత్వం పరమలక్ష్యం ఉత్త మ మానవుణ్ణి నిర్మాణం చేయడమేనని నా అభిప్రా యం. రాధేయ ఉత్తమ కవితాభిరుచికి ‘ఉమ్మడిశెట్టి అవార్డు’ సాహితీ క్షేత్రంలో ఒక ధ్వజస్తంభంగా నిలిచింది. ఎవరి సహకారం లేకుండా స్థాయి ఏ మా త్రం తగ్గకుండా అవార్డు గ్రహీతలను సత్కరించిన విద్వన్మణి రాధేయగా ఒక అవా ర్డును ప్రదానం చేయాలంటే ఎన్నో సమస్యలెదురౌతాయి. రాగద్వేషాలకతీతంగా అ వార్డు గ్రహీతను ఎన్నుకోవడం కత్తిమీద సాము కాదు, నెత్తిమీద సాము నా దృష్టిలో.
రాధేయ ఎప్పటికప్పుడు సామాజిక స్థితిగతులను గమనిస్తూ, సమకాలీన సమాజానికి ప్రతిబింబంగా నిలిచిన కవిత్వాన్ని, ప్రతినిధులుగా నిలిచిన కవులను గుర్తించి ఉదాత్తమైన రీతిలో పురస్కారాలనందించడం ప్రదాత చిరకాల స్వప్నమే కాదు, గ్రహీతల సుకృతమని కూడా నేను భావిస్తున్నాను. కవిని కవే మెచ్చకపోతే ఎట్లా? ఉత్తమ కవితను ఆదరించకపోతే అది మళ్లీ మళ్లీ వసంతంలో మామిడిచెట్టు లాగా ఎలా చిగురించగలుగుతుంది?
“కవిత అంటే
కలత రేపేది కాదు,
ధైర్యానికి చిగురు తొడిగేది”
(చెన్నప్ప నానీలు)
రాధేయ సాహిత్య సృష్టి విలక్షణమైంది. ఆయన కవిత్వంలో ‘మగ్గంబ తుకు’ విశిష్ట రచనగా నిలబడింది, అనేక భాషల్లోకి అనువదింపబడింది, ఆ ధునిక దీర్ఘకావ్యంగా విమర్శకులచే ప్రశంసింపబడింది. అట్లే ఆధునిక కవిత్వంలో వస్తు వైవిధ్య విశ్లేషణకు 2011 మధ్య కాలంలో రచింపబడిన నాల్గు విమర్శగ్రంథాలు తెలుగు సాహిత్య విమర్శలో నాల్గు మైలురాళ్లు!
ఇక ఈ “మూడు పదులు ముప్పు కావ్యాలు” 2018 ఒక విలక్షణమైన సాహి తీ సంప్రదాయానికి బాటలు వేసింది. రాధేయ స్వయంగా అవార్డు ప్రదాతమైనా, అవార్డు పొందిన కవితా సంపుటు లపై చేసిన సమీక్షలు ఈ గ్రం థంలో చోటు చేసుకున్నాయి. ఇంకో విశే షం ఏమంటే అవార్డు గ్రహీతలు స్పందనలను కూడా ఇందులో చేర్చడం జరిగింది.
అవార్డు గ్రహీతల స్వీకృతానందానికి, హృదయ నైర్మల్యానికి, సాహిత్యం పట్ల, అవార్డు పట్ల గల అభినివేశానికి వారి స్పందనలు కారణభూతమైతే, అవార్డు పొందిన కవితా సంపుటాలపై రాధేయ విశ్లేషణలు అవార్డు గ్రహీతల కవిత్వాల తీరు తెన్నులకు అద్దంపట్టాయి. నేను నా వరకు 30 మంది కవుల కవిత్వాలను అవలోకిస్తే వారంతా మానవుణ్ణి కవితా వస్తువుగా స్వీకరించి మానవత్వాన్ని ఆవిష్కరించినట్లనిపించింది.
కృత్యాద్యవస్థలో సౌభాగ్య “ఆత్మనంతా అరచేతిలో విప్పి నిలుచుంటాడు” అన్న మాటలు మాటా పలుకూ లేకుండా సినిమా హాలు ముందు నిలబడి చెయ్యిచాచి అర్థించే ముసలితాతను మన ముందు నిలుపుతాయి. “మువ్వల చేతిక ర్ర”లో శిఖామణి “నన్ను సముద్రపుటొడ్డున వదిలేయండి! ముత్యం దొరకలేదని బాధపడను” అంటూ నిరాశా నిస్పృహలనధిగమించిన మానవుణ్ణి మనకు ప్రత్యక్షం చేస్తాడు. ‘అగ్నిసుధ’లో సుధామ ‘వెలుతురు కోరేవాడు తమస్సుకు భయపడడు’ అంటూ మానవునిలోని ధైర్యానికి ఊపిరులూదుతాడు.
“చరిత్ర చదవందే చరిత్ర రాయలేం అంటూ మానవుడు చరితార్థు డు కావాలని ఆశిస్తాడు. “ఇవాళ”లో ఆఫ్సర్ “మనిషిని గురించి చెప్పండి” అం టూ ఇజాలకు అతీతమైన మనిషిలోని మానవత్వాన్ని ఆవిష్కరిస్తాడు. ‘ఒక సా రాంశం కోసం’లో పాపినేని ‘చిగురాశల స్నేహపుష్పాల జీవిత పరిమళాన్ని కాపాడుకుంటాను” అంటూ మనిషి జీవితం లోని మధుర సంఘటనలను గుర్తుచేస్తాడు. ‘దిశ’లో ఆశారాజు “కన్నీళ్లు తుడిచే చల్లని చేతిని చూపించు” అంటూ మనిషిని కారుణ్యం వైపు నడిపిస్తాడు.
‘మనిద్దరం మతాలం కాదు, మనుషులం’ అంటూ మనిషిలోని మనుష్య త్వాన్ని విదుకపరుస్తాడు. “వయోలిన్ రాశమో మేఘమో’లో కందుకూరి” నెత్తుటి బొట్టుకోసం కన్నీటిబొట్టు ను నైవేద్యంగా సమర్పిస్తాను “అంటూ తనలోంచి పౌరుల్ని ఉద్భవింపజేస్తాడు. ‘ముఖాముఖం’లో దర్భశయనం’ కవీ! నువ్వు మని షికి తండ్రివి ఎందరికో అక్షరాభ్యాసం చేస్తుంటావు అంటూ కవిస్థానాన్ని పదిలపరుస్తాడు. ‘శబ్దస్పర్శ’లో భవానీదేవి “తల్లి గర్భంలో తుళ్లిన తొమ్మిది నెలలే జీవితాం తం మరవలేని వెన్నెల వాక్యం” అంటూ మనిషి మరచిపోయిన మాతృత్వాన్ని గుర్తుకు తెస్తుంది.
“దూదిమేడ”లో నాళేశ్వరం “ఎక్కడున్నా ఏం చేస్తున్నా నా కళ్లలో కిరా, నా దేశం గుండెలోకిరా” అంటూ మానవుణ్ణి స్వదేశభక్తి వైపు మళ్లిస్తాడు. “ఆహ్వానం’లో విజయచంద్ర ‘నేను మనిషిని, నాకెళాంటి సంకెళ్లువద్దు! అంటూ మనిషిలోని స్వేచ్ఛా ప్రవృత్తిని మేల్కొల్పుతాడు. ‘ఆవేద’లో ప్రేమ్చంద్ “కరువు మీద యు ద్ధం ప్రకటించాల్సిందే, కపట రాజకీయం మీద యుద్ధం ప్రకటించాల్సిందే” అంటూ మనిషి ముఖ్య కర్తవ్యాలను ప్రబోధిస్తాడు.
“తలవంచని అరణ్యం”లో అన్వర్ ‘మనం నలుగురం! ఇలా సమావే శం కావడమే పండుగ’ అంటూ ‘సంగచ్ఛద్వం, సం వదధ్వం’ అన్నసూక్తిని గుర్తుకు తెస్తాడు. ‘గోరుకొయ్యలు’లో రామారావు ‘బాధపడడం మా బతుకైందయ్యా, బాధపెట్టడం మీదర్జా అయిందయ్యా’ అంటూ మనుషుల మధ్య గల వృత్యాసాలను ఎత్తి చూపాడు. ‘గాలికట్ట’లో విద్యాసాగర్ ‘ఆకాశమంత వస్త్రాన్ని అగ్గిపెట్టెలో మరిచి చేతుల్ని పోగొట్టుకున్న మనిషి మరోసారి మోసపోయాడు” అంటూ వృత్తి పనివారిలో శ్రేష్ఠుడైనప్పటికీ ఆర్థికంగా చితికిపో యిన చేనేత కార్మికుణ్ణి కళ్లముందు నిలుపుతాడు.
‘విషాదమోహనం’లో కొప్పర్తి “నాకు అమ్మంటే ఇష్టం! అమ్మతో ఉండే నాన్న కూడా ఇష్టం” అంటూ దాంపత్యం లో తియ్యదనాన్ని చాటుతాడు. ‘నిషిద్ధాక్షరి’లో హైమవతి “అందరం కలిసి ఈ జీవితం సిలబస్ మార్చలేమా” అంటూ ప్రతిమనిషి అనుదినం నేర్చుకోవాల్సిన కొత్త పాఠాలను గూర్చి చెప్తారు. ‘పారిపోలేం’లో ప్రభు “జననంం ఒక తల్లి వేడుక! మరణం వేల తల్లుల ఆవేదన” అంటూ దేశం కోసం ప్రాణాలిచ్చే వీరుణ్ణి ప్రత్యక్ష పరుస్తాడు. ‘నదిని దానం చేసాక’లో గంటెడ ‘నాకు ఏరు కావాలి, నా ఏటిపాట కావాలి’ అంటూ మనిషి చేత సుజలగీతం పాడిస్తారు.
‘పునాస’లో అంజయ్య ‘మనకు తెలియకుండానే చావు పుట్టుకల మధ్య చాలాసార్లు జీవించి మరణిస్తాం అంటూ జన్మ పరంపరను తెలియజేస్తాడు. ‘దీపఖడ్గం’లో శివరామకృష్ణ ‘మనిషి ఏకాకి ద్వీపంగా మారడమే వ్యక్తిత్వ వికాసం’ అంటూ మనిషి జీవన సాఫల్యానికి మార్గం చూపుతాడు. ‘ఎడతెగని ప్రయాణం’లో యాకూబ్ “చరిత్ర ముఖంలో మనిషి చిరునవ్వు కొరవడిన కాలంలో నేనున్నాను” అంటూ ఆత్మీయంగా గుండెకు హత్తుకొనే మిత్రుల కోసం ఎదురుచూస్తాడు.
‘అనంతరం’లో విజయకుమార్ “అకాల మరణాల్ని నిర్ణయించే దేవుడు! అసలు పుట్టుకలే ప్రసాదించకుంటే బాగుండేది” అంటూ విధివ్రాతను ప్రశ్నిస్తాడు. ‘మంటిదివ్వ’లో సిరికి “నూరుకోట్ల ఆశల పూదోటకు కాపలా కాసే కొత్త తోటమాలి కావాలి” అంటూ దేశాధినేత ఎంత ఆదర్శంగా ఉండాలో తెలియజేస్తాడు. ‘నివురు’లో నిర్మల ‘దశాబ్దాలుగా కలిసి బతు కుతూ కూడా అపరిచితుల్లా మిగిలిపోయే మన మధ్య ప్రేమ నిలవాలని ఉద్బోధించారు. ‘రాతి చిగుళ్లు’లో శైలజామిత్ర “మట్టి మనిషిలోనే ఉంది! మనిషి మాత్రం మట్టిలో లేడు” అంటూ చేతనా చేతనాలకు మధ్యగల వ్యత్యాసాన్ని చూపుతారు.
‘ఎగరాల్సిన సమయం’లో బాలసుధాకర మౌళి ‘తరగతిగది నాకు యుద్ధభూమి! ధర్మ యుద్ధం తెలిసిన వాడే గురితో పాఠం చెప్పగలడు” అంటూ అధ్యాపకునికి కర్తవ్యోపదేశం చేస్తాడు. ‘కాకిముద్ద’లో ఈత కోట ‘ప్రతిమనిషి ఒక కొత్త పుస్తకమే’ అంటూ ప్రతిక్షణం ప్రతిమనిషిని చదవాల్సిన అవసరం ఉందని ప్రతిపాదిస్తాడు.
‘చేనుగట్టు పియానో’లో ప్రసాదమూర్తి ఇంటికెళ్లినప్పుడల్లా వాళ్లంతా బాల్యం రీలు చుట్టుకున్న ప్రొజెక్టరై పోతాను’ అంటూ మనిషి చిన్ననాటి సంఘటనల నుంచి చైతన్యం పొందాలని తెలుపుతాడు. ‘అమోహం’లో శ్రీసుధ “ప్రపంచంలో మనం మనలో ప్రపంచం లేదని ఎప్పటికి తెలుసుకుంటామో “అంటూ ప్రపంచంలోనే ఉన్న మనకూ ప్రపంచానికి మధ్య గల దూరం అనుభవైకవేద్యమని తత్తావిష్కరణ చేస్తారు.
ఉమ్మడిశెట్టి అవార్డు గ్రహీతలందరూ కవితా పరిణితమూర్తులే. ఇంచుమించుగా ఆయా కవితా సంపుటాలు వెలువరించిన కాలంలోనే కాక, అంతకు ముందర ఆ తర్వాత సాహితీలోకంలో పేరొందినవారే. ఎవరికి వారు నిబద్ధత గలిగి కవిత్వపరంగా ప్రతిభను చూపినవారే. కవిత్వమే జీవితంగా మార్చుకున్న రాధేయ ధన్యుడు.
సెల్: 9885654381
ఆచార్య మసన చెన్నప్ప