కలెక్టర్ చాహత్ బాజ్ పాయిని కలిసిన ట్రైనీ డిప్యూటీ కలెక్టర్
11-11-2026 | 11:42pm
హనుమకొండ, నవంబర్ 11 (విజయక్రాంతి): హనుమకొండ జిల్లా కలెక్టరేట్ లో జిల్లా కలెక్టర్ చాహత్ బాజ్ పాయి(Collector Chahat Bajpai)ని ట్రైనీ డిప్యూటీ కలెక్టర్ ఎం.పవన్ బుధవారం మర్యాద పూర్వకంగా కలిసి మొక్కను అందించారు. హనుమకొండ లోని జవహర్ లాల్ నెహ్రూ స్టేడియంలో డిసెంబర్ నెలలో జరుగునున్న ఖేలో ఇండియా యూత్ గేమ్స్ పర్యవేక్షణ నిమిత్తం ప్రభుత్వం నియమించగా జిల్లా కలెక్టర్ ను ట్రైనీ డిప్యూటీ కలెక్టర్ పవన్ మర్యాద పూర్వకంగా కలవగా జిల్లా కలెక్టర్ శుభాకాంక్షలు తెలియజేశారు.