తక్కువ ఖర్చుతో ఎక్కువ దిగుబడి ఆర్గానిక్ వ్యవసాయం
మహబూబ్నగర్ జిల్లా కలెక్టర్ కుష్బూ గుప్తా
జడ్చర్ల, నవంబర్ 11: తక్కువ ఖర్చుతో ఎక్కువ దిగుబడి ఇచ్చే ఆర్గానిక్ వ్యవసాయం గురించి పాలమూరు జిల్లా కలెక్టర్ కుష్బూ గుప్తా(Collector Khushboo Gupta) వివరించారు. బుధవారం నాడు ఈర్లపల్లి గ్రామ పరిధిలోని దార్తి ఎస్.పి.కే ఫామ్ రాజవర్ధన్ రెడ్డి ఆధ్వర్యంలో ఆర్గానిక్ వ్యవసాయం గురించి తక్కువ నీరుతో ఎక్కువ పంటలు కూరగాయలు మునగకాయలు మునగా ఏ విధంగా మనం పెంచాలి చిన్నా సన్న కారు రైతులు తక్కువ దిగుబడి లాభాలు ఏ విధంగా పొందాలని చెప్పి బుధవారం నాడుఫామ్ హౌస్ దగ్గర కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది.
ఈ సందర్భంగా మహబూబ్నగర్ జిల్లా కలెక్టర్ కుష్బూ గుప్తా మాట్లాడుతూ ఆర్గానిక్ ఫుడ్ తినడం వల్ల మంచి ఆరోగ్యంగా ఉంటామని మనం ఎక్కువ కాలం జీవనం కొనసాగిస్తామని పిల్లలకు చాలా ఆరోగ్యంగా ఉండే విధంగా ఆర్గాన్ ఫుడ్ తినిపించాలని రైతులు ఇలాంటి సాగు చేయడం వలన తక్కువ ఖర్చుతో ఎక్కువ దిగుబడి ఎక్కువ లాభాలు పొందే అవకాశాలు ఉన్నాయని కావున రైతులు కనీసం ఒక్కరైనా ఆర్గానిక్ పద్ధతిలో పండించే ప్రయత్నం చేయాలని అందరి ఆరోగ్యమే రైతు లక్ష్యం కావాలని అందరూ సంతోషంగా ఉండాలని కోరారు.ఈ కార్యక్రమంలో గోవిందు నాయక్, వేణుగోపాల్, విజయ రామారావు ,నరసింహారెడ్డి , పలువురు జిల్లా అధికారులు స్థానిక నాయకులు, గ్రామస్తులు పాల్గొన్నారు.