ఈఎన్‌టీ సదరం–యూడీఐడీ వైద్య శిబిరం

11-11-2026 | 11:38pm

ఆసిఫాబాద్ (విజయక్రాంతి): జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిలో బుధవారం ఈఎన్‌టీ సదరం(ENT Sadaram)–యూడీఐడీ వైద్య శిబిరం నిర్వహించారు. ఈ సందర్భంగా చెవి, ముక్కు, గొంతు సమస్యలు, వినికిడి లోపం ఉన్నవారికి వైద్య పరీక్షలు నిర్వహించి దివ్యాంగత్వ నిర్ధారణ చేపట్టారు. ఈఎన్‌టీ స్పెషలిస్ట్ డాక్టర్ ఎండీ షోయల్, ఆడియోమెట్రిక్ టెక్నీషియన్ డాక్టర్ రాఘవేంద్ర పరీక్షలు నిర్వహించారు.

ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ సీహెచ్ కిరణ్, మెడికల్ కాలేజీ ప్రిన్సిపల్ డాక్టర్ వెంకట్ లాక్కవత్ శిబిరాన్ని సందర్శించి సేవలను పరిశీలించారు. అర్హులైన వారికి సదరం–యూడీఐడీ ధ్రువీకరణ ప్రక్రియ సులభతరం చేయడమే లక్ష్యమని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆర్‌ఎంవోలు డాక్టర్ తిరుమలేశ్, డాక్టర్ స్రవంతి తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు