కాంగ్రెస్ లో చేరిన బిఆర్ఎస్ పార్టీ నాయకులు
బెజ్జూర్ నవంబర్ 11 (విజయక్రాంతి): హైదరాబాద్‌లోని మినిస్టర్ క్వార్టర్స్‌లో కార్మిక శాఖ మంత్రి గడ్డం వివేక్ వెంకటస్వామి(Minister Gaddam Vivek Venkatswamy) నివాసంలో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ దండే విఠల్ ఆధ్వర్యంలో పలువురు నాయకులు బీఆర్ఎస్ పార్టీని వీడి కాంగ్రెస్ పార్టీలో చేరారు.
బెజ్జూర్ మండలానికి చెందిన తాజా మాజీ ఎంపీటీసీ పర్వీన్ సుల్తానా,తెలంగాణ జావిద్, గ్రామపంచాయతీ వార్డు సభ్యులు రామడుగుల రమేష్, తిరుమల స్వప్న ప్రభాకర్‌తో పాటు నాయకులు శ్యామల కిరణ్ కుమార్, కుట్రంగి భీమన్న, కావుడే సుగుణాకర్, మూస అరుణ్, తిరుపతి, రాజేష్ తదితరులు మంత్రి గడ్డం వివేక్ వెంకటస్వామి గారి చేతుల మీదుగా కాంగ్రెస్ పార్టీ కండువాలు కప్పుకొని పార్టీలో చేరారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్సీ దండే విఠల్ నూతనంగా పార్టీలో చేరిన నాయకులకు కాంగ్రెస్ పార్టీ కండువాలు కప్పి సాదరంగా స్వాగతం పలికారు. కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి ప్రతి ఒక్కరూ కలిసికట్టుగా కృషి చేయాలని ఈ సందర్భంగా నాయకులకు ఆకాంక్షించారు.ఈ కార్యక్రమంలో సర్పంచ్ సెండే పద్మ శంకర్, బెజ్జూర్ ఉపసర్పంచ్ రాచకొండ ఆదర్శ్, బెజ్జూర్ మండల కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షులు సామల రాజన్న తదితరులు పాల్గొన్నారు.