ఆంజనేయ స్వామిని దర్శించుకున్న ఎమ్మెల్యే

11-11-2026 | 11:45pm

దేవరకద్ర నవంబర్ 11 (విజయక్రాంతి): మహబూబ్ నగర్ జిల్లా దేవరకద్ర మండలం చిన్న రాజమూర్ లోని శ్రీ ఆంజనేయ స్వామిని నారాయణపేట ఎమ్మెల్యే పర్ణిక రెడ్డి(MLA Parnika Reddy) బుధవారం దర్శించుకున్నారు. ఈ సందర్భంగా దేవాలయానికి వచ్చిన ఎమ్మెల్యేకు ఆలయ మర్యాదలతో  పూర్ణకుంభంతో పూజారులు ఘనంగా స్వాగతం పలికారు.

అనంతరం స్వామివారికి ఎమ్మెల్యే పర్ణిక రెడ్డి ప్రత్యేక పూజలు నిర్వహించారు. పురోహితులు ఆమెపై అక్షింతలు చెల్లి ఆశీర్వచనం పలికారు. ఈ కార్యక్రమంలో దేవస్థానం పురోహితులు, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు