కోట్ల భూమి కొట్టేశారు?
- జగిత్యాల జిల్లా కేంద్రంలో ప్రభుత్వ భూమి కబ్జా
- రోడ్డున సైతం మింగేసిన అక్రమార్కులు
- పట్టించుకోని రెవెన్యూ అధికారులు
జగిత్యాల, నవంబర్ 4 (విజయక్రాంతి): జగిత్యాల జిల్లా(Jagtial District) కేంద్రంలో కోట్ల విలువైన ప్రభుత్వ భూమి ఆక్రమణ(Encroachment of government land) వ్యవహారం కలకలం రేపుతోంది. జగిత్యాల పట్టణ శివారు సర్వే నెంబర్ 1601 లో గల ప్రభుత్వ భూమి, దానికి ఆనుకొని ఉన్న పాత నిజామాబాద్ రోడ్డును కొందరు అక్రమంగా కబ్జా చేస్తున్నారని ఆరోపిస్తూ హస్తాబాద్ గ్రామ పంచాయతీ(Hastabad Gram Panchayat) సర్పంచ్ డి. రాజవ్వ, జగిత్యాల మున్సిపాలిటీ 15వ వార్డు కౌన్సిలర్ అల్లాల సరిత ర మేష్ రావు, స్థానిక ప్రజలు జిల్లా కలెక్టర్(District Collector) కు వినతి పత్రం సమర్పించారు.
ఈ వివాదాస్ప ద భూమి జగిత్యాల మున్సిపాలిటీకి(Jagtial Municipality), హస్తాబాద్ గ్రామానికి మధ్యలో, జి.ఆర్. ఫంక్షన్ హాల్ ఎదురుగా జాతీయ రహదారి ఎన్ హె చ్ - 63 ను ఆనుకొని ఉంది, దీని విలువ బ హిరంగ మార్కెట్ లో సుమారు 2 నుండి 3 కోట్ల రూపాయల వరకు ఉంటుంది. గతం లో ఈ భూమి విషయంలో స్థానికులు రెవె న్యూ అధికారులకు ఫిర్యాదు చేయగా, అధికారులు స్వయంగా వచ్చి సర్వే చేసి హద్దులు నిర్ణయించి, ఇది ప్రభుత్వ రెవెన్యూ భూమి అని సూచిస్తూ బోర్డు కూడా ఏర్పాటు చే శారు.
అయితే గత నాలుగు నెలల క్రితం కొందరు వ్యక్తులు ప్రభుత్వం పెట్టిన హద్దురాళ్లను తొలగించి, ఆ భూమిని జెసిబిలతో చదును చేసి ఆక్రమించే ప్రయత్నం మొదలు పెట్టారు. అంతేకాకుండా దశాబ్దాలుగా ప్రజ లు ఉపయోగిస్తున్న పాత నిజామాబాద్ రో డ్డును కూడా మూసివేసే ప్రయత్నం చేస్తున్నారు. ఈ విషయాన్ని మళ్ళీ రెవెన్యూ అధి కారుల దృష్టికి తీసుకెళ్లగా, సర్వేయర్ ను పం పిస్తామని చెప్పినప్పటికీ ఇంతవరకు ఎవరూ రాకపోవడం విమర్శలకు తావునిస్తుంది.
ప్రభుత్వ భూమిని, ప్రజల రాకపోకలకు ఉపయోగపడే పాత రోడ్డును కాపాడాలని, వెంటనే రెవెన్యూ సర్వేయర్ ను పంపి తిరిగి హద్దులు నిర్ణయించి, ఆక్రమణదారులపై కఠిన చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు కలెక్టర్ ను కోరారు. ప్రభుత్వ ఆస్తుల పరిరక్షణలో నిర్లక్ష్యం వహిస్తే పెద్ద ఎత్తున ఆందోళనకు దిగుతామని హెచ్చరించారు. సర్వేనెంబర్ 1601 లో 7 గుంటల భూమి ఖరిజ్ ఖాతా లో ఉంది. దీనికి సంబంధించి ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు అతి త్వరలో సర్వే చేపట్టనున్నారు.
హెచ్చరిక బోర్డు తీసేశారు..
అది ప్రభుత్వ భూమనీ, గతంలో అక్కడ హెచ్చరిక బోర్డు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. దానిని ఎవరో తీసివేశారు. దీనిపై ఉన్నతాధికారులు చట్టప్రకారం తగు చర్యలు తీసుకుంటారు. అందుకే గ్రామస్తులు ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారు.
రాజ్ కిషన్, జీపీఓ, హస్నాబాద్