చెల్పూర్ ఎంజీఎం హైస్కూల్‌లో ఘనంగా బాలల దినోత్సవం

14-11-2026 | 07:30pm

గణపురం, నవంబర్ 14 (విజయంక్రాంతి): మండలంలోని చెల్పూర్‌ ఎంజీఎం హైస్కూల్‌లో(Chelpur MGM High School) బాలల దినోత్సవ(Childrens Day) వేడుకలను శనివారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థులకు క్రీడలు, నృత్యాలు, నాటికలు, పాటలు, వక్తృత్వం, వ్యాసరచన పోటీలు నిర్వహించారు. నెహ్రూ సేవలను, బాలల పట్ల ఆయనకున్న అభిమానాన్ని గుర్తు చేసుకున్నారు.

పాఠశాల కరస్పాండెంట్ గ్యాదంగి సతీష్ మాట్లాడుతూ నేటి బాలలే రేపటి దేశ భవిష్యత్తని, విద్యతో పాటు విలువలను నేర్పించి ఉత్తమ సమాజ నిర్మాణానికి కృషి చేయాలని అన్నారు. అనంతరం విద్యార్థులకు చాక్లెట్లు, స్వీట్లు, బహుమతులు అందజేశారు. కార్యక్రమంలో ప్రిన్సిపాల్ పెండ్యాల మధుకర్, డైరెక్టర్లు గ్యాదంగి రమాదేవి, సిల్వేరి శ్రీనివాస్, ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు