ఫ్రోబెల్ మోడల్ హైస్కూల్‌లో ఘనంగా బాలల దినోత్సవం

14-11-2026 | 07:05pm

గణపురం,నవంబర్ 14 (విజయక్రాంతి): గణపురం మండల(Ganapuram Mandal) కేంద్రంలోని ఫ్రోబెల్ మోడల్ హైస్కూల్‌లో బాలల దినోత్సవ వేడుకలు శనివారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థులకు సాహిత్య, సాంస్కృతిక పోటీలు నిర్వహించి, ప్రతిభ కనబరిచిన వారికి బహుమతులు, ప్రశంసాపత్రాలు అందజేశారు. 


ఈ సందర్భంగా పాఠశాల ప్రధానోపాధ్యాయులు ల్యాదల్ల కృష్ణ గౌడ్ కరస్పాండెంట్ పబ్బ. శివశంకర్ గౌడ్, డైరెక్టర్లు ల్యాదల్ల యాదగిరి గౌడ్, సుంకరి జగన్ రెడ్డి లు మాట్లాడుతూ బాలలే దేశ భవిష్యత్తని, విద్యార్థులు క్రమశిక్షణ, మంచి నడవడిక, ఆత్మవిశ్వాసంతో చదివి ఉన్నత లక్ష్యాలను సాధించాలని సూచించారు. ప్రతి విద్యార్థిలోని ప్రతిభను గుర్తించి ప్రోత్సహించాల్సిన అవసరం ఉందన్నారు. కార్యక్రమంలో ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు