ఘనంగా ఇందిరాగాంధీ జయంతి వేడుకలు
భూపాలపల్లి, నవంబర్ 19 (విజయ క్రాంతి): జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు(District Congress President) బట్టు కరుణాకర్ ఆధ్వర్యంలో భూపాలపల్లి అంబేద్కర్ సెంటర్లో ఇందిరాగాంధీ జయంతి వేడుకలు(Indira Gandhi Birth Anniversary Celebrations) ఘనంగా నిర్వహించారు. ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు కేక్ కట్ చేసి, ఇందిరాగాంధీ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు.
ఈ సందర్భంగా ఆమె దేశానికి, పేద ప్రజలకు చేసిన సేవలను స్మరించుకున్నారు. ఈ కార్యక్రమంలో పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు దాట్ల శ్రీనివాస్, మున్సిపల్ చైర్మన్ బుర్ర కొమురయ్య గౌడ్, వైస్ చైర్మన్ శ్రీనివాస్, కౌన్సిలర్లు కురిమిల శీను, చల్ల రేణుక, పొన్నగంటి శీను, జిల్లా కాంగ్రెస్ వైస్ ప్రెసిడెంట్ భువన సుందర్, మాట్టేవాడ సురేష్, ఆలోత్ కిషోర్, నాగరాజు, అవినాష్ రాజు, హరీష్, బన్నీ, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.