భార్య ఆత్మహత్యకు కారణమైన భర్త అరెస్ట్

19-11-2026 | 06:40pm

కరీంనగర్ క్రైం, నవంబర్ 19 (విజయక్రాంతి): కరీంనగర్ రూరల్ మండలంలోని ఇరుకుల్ల గ్రామంలో(Irukulla Village) వివాహిత స్రవంతి ఆత్మహత్యకు(Suicide) పాల్పడిన ఘటనలో ఆమె భర్త కొత్తూరి సంపత్‌ను కరీంనగర్ రూరల్ పోలీసులు(Karimnagar Rural Police) అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. వరంగల్ జిల్లాకు చెందిన ఇమ్మడి ముత్తయ్య తన కుమార్తె స్రవంతి నీ  కరీంనగర్ రూరల్ మండలం ఇరుకుల్ల గ్రామానికి చెందిన కొత్తూరి సంపత్‌కు ఇచ్చి వివాహం జరిపించారు. వీరికి ఇద్దరు కుమార్తెలు ఉన్నారు.

అయితే, గత కొంతకాలంగా కొత్తూరి సంపత్ తన భార్యని  వేధిస్తుండేవాడు. రెండేళ్లుగా సంపత్ నిజామాబాద్ జిల్లా సిరికొండ మండలానికి చెందిన ఒక మహిళతో పరిచయం ఏర్పరచుకొని అక్రమ సంబంధం కొనసాగిస్తున్నాడు. సదరు మహిళ భార్యను వదిలించుకోవాలని సంపత్‌పై ఒత్తిడి తేవడంతో వేధింపులు మరింత ఎక్కువయ్యాయి. ఈ నెల 9వ తేదీ రాత్రి సంపత్ తన మొబైల్ ఫోన్‌లో సదరు మహిళతో వీడియో కాల్స్, చాటింగ్స్ చేస్తుండగా స్రవంతి  గమనించి  నిలదీసింది. 

భర్త ప్రవర్తనతో తీవ్ర మనస్తాపానికి గురైన స్రవంతి  మరుసటి రోజు ఉదయం ఇంట్లోని పిల్లల బెడ్‌రూమ్‌లో ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడింది. ఈ ఘటనపై మృతురాలి తండ్రి ఇమ్మడి ముత్తయ్య ఇచ్చిన ఫిర్యాదు మేరకు కరీంనగర్ రూరల్ పోలీసులు కొత్తూరి సంపత్‌పై కేసు నమోదు చేశారు.ఈ క్రమంలో గురువారం బొమ్మకల్ ఫ్లైఓవర్ సమీపంలోని జైలు బంక్ వద్ద సంపత్ ను అదుపులోకి తీసుకొని కోర్టులో హాజరు పరిచి రిమాండ్ కు తరలించినట్లు ఇన్స్పెక్టర్ నిరంజన్ రెడ్డి తెలిపారు.

మరిన్ని వార్తలు