విద్యుత్ మోటార్ల దొంగల ముఠా పట్టివేత
18 లక్షల విలువైన సొత్తు స్వాధీనం
వరంగల్ (విజయక్రాంతి): వరంగల్ పోలీస్ కమిషనరేట్(Warangal Police Commissionerate) పరిధిలో విద్యుత్తు మోటార్ల దొంగతనాలకు పాల్పడుతున్న ముఠాను పోలీసులు అరెస్టు చేసి 18 లక్షల విలువైన సొత్తును స్వాధీనం చేసుకొని, ముగ్గురు నిందితుల అరెస్ట్, నలుగురు బాలుర అదుపులోకి తీసుకున్నారు. ఈస్ట్ జోన్ డీసీపీ అంకిత్ కుమార్ కథనం ప్రకారం..
వ్యవసాయ బావుల వద్ద ఏర్పాటు చేసిన విద్యుత్ నీటి మోటార్లను అపహరిస్తూ వరుస దొంగతనాలకు పాల్పడుతున్న ముఠాను నర్సంపేట పోలీసులు పట్టుకున్నారు. ఈ కేసులో ముగ్గురు ప్రధాన నిందితులను అరెస్ట్ చేయడంతో పాటు, మరో నలుగురు బాలురను అదుపులోకి తీసుకున్నారు. వారి నుంచి సుమారు రూ.18,44,800 విలువైన 84 విద్యుత్ నీటి మోటార్లతో పాటు,
దొంగతనాలకు ఉపయోగించిన నాలుగు వాహనాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. నిందితులను పట్టుకోవడంలో ప్రతిభ కనబరిచిన సిబ్బందికి ఈస్ట్ జోన్ డిసిపి నగదు రివార్డులను అందజేశారు. ఈ కార్యక్రమంలో నర్సంపేట ఏసీపీ రవీందర్ రెడ్డి, నర్సంపేట ఇన్స్పెక్టర్ ముస్కా శ్రీనివాస్, ఎస్ ఐ రాజన్ బాబు, సిసిఎస్ ఇన్స్పెక్టర్ లు హరికృష్ణ రాఘవేందర్రావు సిబ్బంది పాల్గొన్నారు.