ఇందిరా గాంధీ చేసిన సేవలు చిరస్మరణీయo

19-11-2026 | 06:56pm

సూర్యాపేట జిల్లా కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు చలసాని శ్రీనివాసరావు.

నేరేడుచర్ల,నవంబర్ 19(విజయ క్రాంతి): బడుగు, బలహీన వర్గాల అభ్యున్నతికి ఇందిరా గాంధీ(Indira Gandhi) చేసిన సేవలు చిరస్మరణీయమని సూర్యాపేట జిల్లా కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు చలసాని శ్రీనివాసరావు అన్నారు. మాజీ ప్రధానమంత్రి, ఉక్కు మహిళ స్వర్గీయ ఇందిరా గాంధీ జయoతి వేడుకలను గురువారం కల్లూరు గ్రామంలో ఆయన నివాసం వద్ద ఏర్పాటు చేసిన కార్యక్రమంలో నాయకులు,

కార్యకర్తలు ఇందిరా గాంధీ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.ఈ సందర్భంగా చలసాని శ్రీనివాసరావు మాట్లాడుతూ హరిత విప్లవం ద్వారా దేశాన్ని ఆహార ధాన్యాల ఉత్పత్తిలో స్వయం సమృద్ధి సాధించేలా చేశారని, బ్యాంకుల జాతీయీకరణ, గరీబీ హటావో వంటి చారిత్రాత్మక నిర్ణయాలతో పేదల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయారని కొనియాడారు.

నేటి తరం నాయకులు, కార్యకర్తలు ఇందిరా గాంధీ ఆశయాలను, పోరాట స్ఫూర్తిని ఆదర్శంగా తీసుకుని ముందుకు సాగాలని పిలుపు నిచ్చారు.ఈ కార్యక్రమంలో కల్లూరు గ్రామ సర్పంచ్ చలసాని మంజుల శ్రీనివాసరావు, నియోజకవర్గ నాయకుడు చలసాని రాజీవ్, కల్లూరు గ్రామ కాంగ్రెస్ అధ్యక్షుడు బుడిగె వెంకటేశ్వర్లు గౌడ్, నేరేడుచర్ల మాజీ అగ్రికల్చర్ డైరెక్టర్ కొడాలి పట్టయ్య,

మాజీ పీఏసీఎస్ చైర్మన్ కొడాలి భాస్కర్ రావు, మాజీ వైస్ ఎంపీపీ చలసాని మాధవరావు, ఉప సర్పంచ్ ఉప్పెల్లి మహేష్, యార్లగడ్డ వెంకటేశ్వరరావు, మేకపోతుల నాగరాజు తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు