పుస్తక పఠనంతో జ్ఞానం పెరుగుతుంది
జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ గంగాపురం రాజేందర్.
నాగర్ కర్నూల్ (విజయక్రాంతి ): పుస్తక పఠనంతోనే జ్ఞానం, విజ్ఞానం(Knowledge, Wisdom) పెరుగుతాయని జిల్లా గ్రంథాలయ సంస్థ (District Library Authority) చైర్మన్ గంగాపురం రాజేందర్ అన్నారు. ప్రతి విద్యార్థి గ్రంథాలయాలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. గురువారం తెలకపల్లి మండల కేంద్రంలోని గ్రంథాలయంలో గ్రంథాలయ పితామహుడు డాక్టర్ ఎస్.ఆర్. రంగనాథన్ చిత్రపటాన్ని ఆయన ఆవిష్కరించారు.
రిటైర్డ్ గ్రంథాలయ అధికారిణి రాజ్యలక్ష్మి చిత్రపటాన్ని బహూకరించారు. ఈ సందర్భంగా రంగనాథన్ గ్రంథాలయ రంగానికి చేసిన సేవలను కొనియాడారు. గ్రంథాలయాల అభివృద్ధికి కృషి చేస్తామని హామీ ఇచ్చారు. వారితో పాటు సర్పంచ్ కొమ్ము చంద్రశేఖర్, ఉపసర్పంచ్ వారణాసి శ్రీనివాసులు, గ్రంథాలయ సిబ్బంది భోగరాజు పవన్, మండల విద్యాధికారి నరహరి, ప్రజాప్రతినిధులు, నాయకులు, పాఠకులు, విద్యార్థులు పాల్గొన్నారు.