గ్రామపంచాయతీ భవనానికి దర్వాజ ప్రతిష్టాపన
తాడ్వాయి,నవంబర్,19( విజయ క్రాంతి): కామారెడ్డి జిల్లా తాడ్వాయి మండలం నందివాడ గ్రామపంచాయతీ(Nandiwada Grama Panchayat) నూతన భవనానికి గురువారం గ్రామ సర్పంచ్ పోచయ్య, గ్రామ పెద్దలు దర్వాజకు ప్రతిష్టాపన నిర్వహించారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ... స్థానిక ఎమ్మెల్యే మదన్ మోహన్ రావు (MLA Madan Mohan Rao) కృషితో గ్రామపంచాయతీ భవనాన్ని నిర్మించు కోగలుగుతున్నా మని తెలిపారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యేకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ పొద్దుటూరి నవీన్ రెడ్డి,వీడిసి అధ్యక్షులు కంకణాల బాలచంద్రం,వార్డు సభ్యులు దత్తు రెడ్డి, రాజయ్య,శోభ,అనిత, కాంగ్రెస్ పార్టీ గ్రామ అధ్యక్షులు కానగళ్ళ బాల సాయిలు,గ్రామ పెద్దలు మల్లారెడ్డి, భాస్కర్,సంగారెడ్డి తదితరులు పాల్గొన్నారు.