ఖేలో ఇండియా యూత్ గేమ్స్ లోగో, మస్కట్ ఆవిష్కరణ
19-11-2026 | 06:54pm
భూపాలపల్లి, నవంబర్ 19 (విజయ క్రాంతి): ‘ఖేలో ఇండియా యూత్ గేమ్స్–తెలంగాణ 2026’(Khelo India Youth Games) అధికారిక లోగో, మస్కట్ ‘నీలమణి’ పోస్టర్లను గురువారం కలెక్టరేట్లో జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ, జిల్లా యువజన, క్రీడల అధికారి చిర్ర రఘు గౌడ్ తో కలిసి ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ యువ క్రీడాకారుల్లో ప్రతిభను వెలికితీసి జాతీయ స్థాయిలో ప్రోత్సహించేందుకు ఖేలో ఇండియా గేమ్స్ దోహదపడతాయన్నారు. జిల్లాలోని క్రీడాకారులు అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని జిల్లాకు మంచి పేరు తీసుకురావాలని కోరారు. ఈ కార్యక్రమంలో కార్యాలయ సిబ్బంది ఎం. శివసాగర్ పాల్గొన్నారు.