కాగజ్ నగర్ రూరల్ ఎస్. ఐ బాధ్యతల స్వీకరణ
కాగజ్ నగర్ ,నంబర్ 19 ( విజయ క్రాంతి): కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా కాగజ్ నగర్ రూరల్ పోలీస్(Kagaznagar Rural Police) సబ్ ఇన్స్పెక్టర్ గా గుండేటి సంధ్యారాణి గురువారం బాధ్యతలు స్వీకరించారు. ఎస్సై సంధ్యారాణి రామగుండం పోలీస్ కమిషనరేటు నుండి కాగజ్ నగర్ రూరల్ ఎస్. ఐ గా బదిలీపై వచ్చారు. ఇక్కడ ఇప్పటివరకు ఎస్సైగా విధులు నిర్వహించిన కాటారపు సందీప్ కుమార్ ములుగు జిల్లాకు బదిలీపై వెళ్లారు.
ఎస్పిని కలిసిన ఎస్.ఐ..
కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా పోలీస్ అధికారి నికిత పంత్ ను కాగజ్ నగర్ రూరల్ ఎస్సైగా కొత్తగా బాధ్యతలు స్వీకరించిన జి .సంధ్యారాణి గురువారం జిల్లా పోలీస్ కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఎస్పీకి ఎస్. ఐ సంధ్యారాణి పుష్పగుచ్చం అందజేశారు.