భవన నిర్మాణ భద్రతపై చర్య తీసుకోవాలి

19-11-2026 | 06:13pm

నిర్మల్, నవంబర్ 19(విజయ క్రాంతి): నిర్మల్ జిల్లా కేంద్రంలో భవన నిర్మాణ(Building construction) భద్రతలపై అధికారులు చర్య తీసుకోవాలని ఆమ్ ఆద్మీ పార్టీ(Aam Aadmi Party) జిల్లా కన్వీనర్ అధికారులకు ఫిర్యాదు చేశారు. గురువారం డిఆర్ఓ రమేష్ రాథోడ్ని కలిసి వినతిపత్రం అందించారు. నిర్మల్‌లో ఆనంద్ షాపింగ్ మాల్ సమీపంలోని నిర్మాణంలో ఉన్న బహుళ అంతస్తుల భవనంపై నుంచి సంగీత అనే యువతి దూకి తీవ్రంగా గాయపడిన ఘటనపై విచారం వ్యక్తం చేశారు. 

నిర్మాణాల్లో సేఫ్టీ నెట్స్, బారికేడ్లు, గ్రిల్స్ వంటి కనీస భద్రతా ఏర్పాట్లు చేయడం లేదని ఆరోపించారు. నిబంధనలు పాటించని భవన యజమానులపై క్రిమినల్ కేసులు నమోదు చేసి, అవసరమైతే అనుమతులు రద్దు చేయాలని కోరారు.

భద్రతా ప్రమాణాల పర్యవేక్షణలో నిర్లక్ష్యం వహించిన మున్సిపల్ కమిషనర్, టౌన్ ప్లానింగ్ అధికారుల నిర్లక్ష్యంపై ఆయన మనిపడ్డారు. వినతిపత్రం ప్రతులను జిల్లా ఎస్పీ, రాష్ట్ర మానవ హక్కుల కమిషన్, CDMA, అగ్నిమాపక శాఖ డైరెక్టర్, టౌన్ సీఐలకు అందజేశారు. జిల్లా కలెక్టర్ స్పందించి సమగ్ర విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని సయ్యద్ హైదర్ కోరారు.

మరిన్ని వార్తలు