ఎర్ర జెండా పోరాట వారసత్వాన్ని కాపాడుకోవాలి

15-11-2026 | 10:24pm
  1. కార్పొరేట్ విధానాలతో రైతాంగానికి నష్టం. 
  2. రైతులు వ్యవసాయ కార్మికుల హక్కుల కోసం ఐక్య పోరాటాలు చేయాలి
  3. మాజీ పార్లమెంటు సభ్యురాలు బృందాకారత్.           

నల్లగొండ, నవంబర్ 15 (విజయక్రాంతి) : దేశంలో ప్రజా సమస్యలు పరిష్కారం కావాలంటే ఎర్రజెండా(Red Flag) పోరాట వారసత్వాన్ని(Legacy of Struggle) కాపాడుకోవాలని మాజీ పార్లమెంట్ సభ్యురాలు, అఖిల భారత ప్రజాతంత్ర మహిళా సంఘం (ఐద్వా) జాతీయ నాయకురాలు బృందా కారత్ పిలుపునిచ్చారు. ఆదివారం నల్లగొండ పట్టణంలోని(Nalgonda) ఎన్జీ కళాశాల ప్రాంగణంలో నిర్వహించిన 36వ అఖిల భారత కిసాన్(All India Kisan) సభ మహాసభల బహిరంగ సభలో ఆమె ముఖ్యఅతిథిగా పాల్గొని ప్రసంగించారు.

భూస్వామ్య దోపిడీ, వెట్టిచాకిరీకి వ్యతిరేకంగా సాగిన తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటం రైతుల విముక్తి కోసం జరిగిన లౌకిక పోరాటమని స్పష్టం చేశారు. రైతులు, వ్యవసాయ కార్మికులు, గ్రామీణ పేదల హక్కుల పరిరక్షణ కోసం ఎర్రజెండా పోరాట వారసత్వాన్ని కొనసాగించాలని పిలుపునిచ్చారు. కిసాన్ సభ తొమ్మిది దశాబ్దాలుగా రైతాంగం, వ్యవసాయ కార్మికులు, గ్రామీణ పేదల పక్షాన పోరాడుతోందని పేర్కొన్నారు. దేశవ్యాప్తంగా రైతాంగ హక్కుల సాధన కోసం సాగిన ఉద్యమాల్లో ఎర్రజెండా కీలక పాత్ర పోషించిందన్నారు.

సాయుధ పోరాటంలో నల్లగొండ జిల్లాది కీలక పాత్ర  : 

నిజాం పాలనలో భూస్వామ్య దేశ్‌ముఖ్‌ల దోపిడీ, రజాకార్ల అండతో కొనసాగిన వెట్టిచాకిరీకి వ్యతిరేకంగా నల్లగొండ జిల్లాలో సాగిన తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటం చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయిందని బృందా కారత్ అన్నారు. మూడు వేలకుపైగా గ్రామాలను భూస్వామ్య బంధనాల నుంచి విముక్తి చేసి, దున్నేవాడికే భూమి దక్కాలనే లక్ష్యంతో ఉద్యమం సాగిందని గుర్తుచేశారు.

ఈ పోరాటంలో తొలి అమరుడు దొడ్డి కొమరయ్య, భూస్వామ్య శక్తులను ఎదిరించిన చాకలి ఐలమ్మ, పుచ్చలపల్లి సుందరయ్య, మల్లు స్వరాజ్యం వంటి నాయకుల త్యాగాలను స్మరించుకున్నారు. నాలుగు వేల మంది అమరవీరుల త్యాగాలకు లాల్‌సలాం ప్రకటించారు.తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటాన్ని హిందూ, ముస్లింల మధ్య జరిగిన పోరాటంగా చిత్రీకరించేందుకు బీజేపీ, ఆర్‌ఎస్‌ఎస్‌ ప్రయత్నిస్తున్నాయని ఆమె విమర్శించారు. అది మతపరమైన పోరాటం కాదని, భూస్వామ్య దోపిడీకి వ్యతిరేకంగా రైతాంగం సాగించిన విముక్తి పోరాటమని స్పష్టం చేశారు. 

 కార్పొరేట్ల ప్రయోజనాలకే కేంద్రం ప్రాధాన్యత :

కేంద్రంలోని మోదీ ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలు రైతాంగ ప్రయోజనాలకు విరుద్ధంగా ఉన్నాయని బృందా కారత్ విమర్శించారు. విదేశీ కంపెనీలు, కార్పొరేట్ సంస్థలు, పెద్ద వ్యవసాయ వ్యాపార సంస్థలకు అనుకూలంగా వ్యవసాయ విధానాలు రూపొందిస్తున్నారని ఆరోపించారు.భారత్‌-అమెరికా వాణిజ్య ఒప్పందం వల్ల దేశంలోని వివిధ రంగాల రైతులకు నష్టం కలిగే ప్రమాదం ఉందని పేర్కొన్నారు. రైతులతో చర్చించకుండా ఇలాంటి ఒప్పందాలపై ముందుకు వెళ్లడం సరికాదని, ఆ ఒప్పందాన్ని నిలిపివేయాలని డిమాండ్ చేశారు.  దేశంలో వ్యవసాయ సంక్షోభం తీవ్రరూపం దాల్చుతోందని, కరువు, వరదలు, పంట నష్టాలు రైతులను అప్పుల ఊబిలోకి నెడుతున్నాయని బృందా కారత్ ఆవేదన వ్యక్తం చేశారు. 

ఎన్‌సీఆర్‌బీ గణాంకాల ప్రకారం గత 12 ఏళ్లలో దేశంలో లక్షన్నర వ్యవసాయ సంబంధిత ఆత్మహత్యలు నమోదయ్యాయని ప్రస్తావించారు. రైతుల ఆత్మహత్యలు ఆగాలంటే వ్యవసాయ విధానాల్లో సమూల మార్పులు రావాలన్నారు. స్వామినాథన్ కమిషన్ సిఫార్సుల ప్రకారం పంటలకు కనీస మద్దతు ధర కల్పించాలని డిమాండ్ చేశారు. డీజిల్ ధరలను నియంత్రించాలని, విద్యుత్ ప్రైవేటీకరణను నిలిపివేయాలని, స్మార్ట్ మీటర్ల పేరుతో రైతులపై అదనపు భారం మోపవద్దని కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు.

రైతులకు ఏడాదికి రూ.6 వేల ఆర్థిక సాయం అందిస్తూ ప్రభుత్వం గొప్పగా ప్రచారం చేసుకుంటోందని విమర్శించారు.  భూగరిష్ట పరిమితి చట్టాలను పకడ్బందీగా అమలు చేయాలన్నారు. వ్యవసాయ రంగంలో మహిళలు కీలక పాత్ర పోషిస్తున్నప్పటికీ వారికి రైతులుగా తగిన గుర్తింపు ఇవ్వాలన్నారు. 

అభివృద్ధి ప్రాజెక్టుల పేరుతో సాగుభూములను సేకరిస్తూ రైతులను నిర్వాసితులుగా మారుస్తున్నారని బృందా కారత్ విమర్శించారు. 2013 భూసేకరణ చట్టం ప్రకారం పరిహారం అందించాలన్నారు. అటవీ హక్కుల చట్టాన్ని పకడ్బందీగా అమలు చేయాలని కోరారు. పోడు భూములు సాగు చేసుకుంటున్న ఆదివాసీ రైతులకు హక్కు పత్రాలు అందించాలని అన్నారు.

 తెలంగాణ ప్రభుత్వం ఆదివాసి హక్కులను పరిరక్షించాలి :

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డిని ఉద్దేశించి మాట్లాడుతూ గ్రామసభల అధికారాలను గౌరవించాలని, ఆదివాసీల హక్కులను పరిరక్షించాలని కోరారు. అటవీ హక్కుల చట్టం ప్రకారం అర్హులైన వా…

మరిన్ని వార్తలు