కనిపించని పరిశుభ్రత..

07-10-2026 | 05:15am
  1. రోడ్లపై చెత్త, చికెన్ వ్యర్ధాలు ..
  2. గ్రామాలకు వెళ్లే రోడ్లు దుర్గంధ మయం 
  3. పట్టించుకోని అధికారులు, గ్రామ పాలకులు 

బీబీపేట, అక్టోబర్ 6 (విజయ క్రాంతి): గ్రామాల్లో పరిశుభ్రతపై(Cleanliness) ప్రజా ప్రతినిధులు, అధికారులు పట్టించుకోవడం లేదు. కామారెడ్డి జిల్లా(Kamareddy District) బీబీపేట మండల కేంద్రంలో పలు ప్రాంతాలలో చెత్త పేరుకుపోతున్న పట్టనట్లు అధికారులు, ప్రజా ప్రతినిధులు వ్యవహరిస్తున్నారు. బీబిపేట లో  అధికారుల నిర్లక్ష్యం కొట్టొచ్చినట్లు కనిపిస్తుందని గ్రామ ప్రజలు వాపోతున్నారు. మండల కేంద్రం లో గల పలు విద్యాలయాలకు వెళ్లే దారుల్లో చెత్తను ఇష్టం వచ్చినట్లు పడవేస్తున్న దాన్ని పట్టించుకునే నాధుడు లేడు.

చెత్తను తొలగించేటటు వంటి కార్మికులకు చెప్పేవారు లేరు. బీబీపేట మండల కేంద్రంలో  ఎస్సీ హాస్టల్(SC Hostel) నుండి సి రిగాధ వెళ్లే దారిలో, రైతు వేదిక నుండి జిల్లా పరిషత్ పాఠశాలకు వెళ్లే దారిలో వ్యర్ధాలను రోడ్లపై వేస్తున్నారు. స్థానికులు బహిరంగ మ లవిసర్జనలు చేస్తున్నారు. చెత్తను పడవేస్తున్న గ్రామ ప్రజా ప్రతినిధులు, అధికారులు, వి డ్డూరం చూస్తున్నారని ప్రజలు విద్యార్థులు వాపోతున్నారు.

మండల కేంద్రంలో నుండి శ్రీ గాద వెళ్లే మార్గంలో చెత్తను పడవేస్తున్నారు, బీబీపేట పెద్ద చెరువు నుండి బయటకు ప్రవహించే అలుగు మార్గంలో, యాడారం వెళ్లే మార్గంలో, పశుపక్షాదులు త్రాగే నీటిలో ,కొత్త చెరువులో  చికెన్ సెంటర్ ల నిర్వాహకులు చికెన్ వ్యర్థాలను విచ్చలవిడిగా  పడే స్తున్నారు. దీనితో కలుషితమై నీటిలో చేపల పెరుగుదల తో పాటు వ్యర్ధాలను తిని కుక్క లు గ్రామంలో స్త్వ్రర విహారం చేస్తున్నాయి, వ్యర్థాలను తిని కోతు లు జనాల లోకి సంచరిస్తున్నాయి. 

జనాలలో కుక్కలు, కో తు ల వల్ల అనేకమంది గా యపడ్డారు, తద్వారా రోగాలు ప్రబలుతున్నాయని గ్రామస్తులు పలుమార్లు అధికారులకు, గ్రామపంచాయతీ పాలకవర్గాలకు తెలిపినా పట్టించు కోవడం లేదు. కొంతవరకు కోతుల నివారణకు చర్యలు చేపడతామని పలు సంఘాల ద్వారా డబ్బులను వసూలు చేసి కొంతమేరకు కోతులను తొలగించినా మిగితా కో తుల వల్ల అనేక సమస్యలు తలెత్తడంతో మండల కేంద్ర ప్రజలు, అటు పంట పొలాలలో పాడి రైతులకు నష్టం కలిగించే విధంగా దూడలపై దాడి చేస్తున్నాయి.

ఊర కుక్కలు విస్తృతంగా గాయపరుస్తున్నా యి. దూడల మరణాలకు పాల్పడుతున్నాయని  పలుమార్లు కూడా పంచాయితీ అధికారికి, సర్పంచ్ కి విన్నవించిన ఫలితం లేకుండా పోయిందని ప్రజలు వాపోతున్నారు. విద్యార్థులు, ప్రయాణికులు వెళ్లే దారులలో వ్యర్ధాలను చెరువులలో, కుంటలలో చికెన్ కళేబరాలను, వ్యర్ధాలను రోడ్ల పక్కన పోయడం వల్ల భూకాలుష్యం దుర్వాసన వస్తుందని గ్రామస్తులు తెలిపారు, వ్యర్థ పదార్థాలు రోడ్డు పక్కన  వేయడంతో ఇటు మండల కేంద్ర ప్రజలతో పాటు చుట్టుప్రక్కల ఉన్న గ్రామాల ప్రజల ఆరోగ్యాలను దృష్టిలో ఉంచుకోవాలని పలువురు  వాపోతున్నారు.

ఇకనైనా సంబంధిత అధికారులు, గ్రామపంచాయతీ పాలకవర్గ సభ్యులు పట్టించుకోని రోడ్డు పక్కన ఉన్న వ్యర్థాలను తొలగిం చి తగు చర్యలు చేపట్టాలని మండల కేంద్ర ప్రజలు కోరుతున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందిస్తారో లేదో వేచి చూడాల్సిందే. వ్యర్థ పదార్థాలు, చెత్త చెదారాలు రోడ్డు పక్కన వేయడంతో దుర్వాసనతో పాటు దోమలు, ఈగలు  విజృంభించడంతో, ప్రజలు రోగాల బారిన పడుతున్నారు.

మరిన్ని వార్తలు