కేటీఆర్ కు స్వాగతం పలికిన బీఆర్ఎస్ నాయకులు
కామారెడ్డి, నవంబర్ 11 (విజయక్రాంతి): నిర్మల్ జిల్లాకు వెళ్తున్న సందర్భంగా బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(BRS Working President KTR)కు కామారెడ్డి బైపాస్ వద్ద మాజీ ఎమ్మెల్యే గంప గోవర్ధన్ ఆధ్వర్యంలో స్వాగతం పలికారు. అనంతరం ఎల్లారెడ్డి నియోజకవర్గంలోని పద్మాజివాడి చౌరస్తా వద్ద ఎల్లారెడ్డి మాజీ ఎమ్మెల్యే జాజాల సురేందర్ ఆధ్వర్యంలో బిఆర్ఎస్ నాయకులు స్వాగతం పలికారు. కేటీఆర్ కార్యకర్తలను చూసి కారు నుంచి దిగి కేటీఆర్ విక్టరీ చూపుతో సంతోషం వ్యక్తం చేశారు. కేటీఆర్ తో కామారెడ్డి మాజీ ఎమ్మెల్యే గంప గోవర్ధన్ తో పాటు బి ఆర్ ఎస్ జిల్లా అధ్యక్షులు ముజీబుద్దిన్, ఎల్లారెడ్డి మాజీ ఎమ్మెల్యే జాజాల సురేందర్ కేటీఆర్ కారులో నిర్మల్ కు వెళ్లారు. వారి అనుచరులు వారి కారులలో నిర్మల్ కు కేటీఆర్ తో కలిసి వెళ్లారు.