ప్రత్యేక పూజల్లో పాల్గొన్న మున్సిపల్ మాజీ చైర్మన్
సుల్తానాబాద్, ఎలిగేడు, నవంబర్ 11 (విజయక్రాంతి): పెద్దపల్లి జిల్లా ఎలిగేడు మండలంలోని రాములపల్లి గ్రామ శివాలయంలో నిర్వహించిన ప్రత్యేక పూజా కార్యక్రమాల్లో మాజీ మున్సిపల్ చైర్పర్సన్ డాక్టర్ దాసరి మమతా రెడ్డి(Dasari Mamatha Reddy) బుధవారం పాల్గొని స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు.
ఈ సందర్భంగా మమతా రెడ్డి మాట్లాడుతూ శివుని అనుగ్రహంతో ప్రజలందరూ సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో ఉండాలని, పాడిపంటలతో గ్రామాలు సుభిక్షంగా ఉండాలని, ప్రతి ఒక్కరి జీవితాల్లో శాంతి, సంతోషాలు వెల్లివిరియాలని ఆకాంక్షించారు. ఆలయాల్లో నిర్వహించే ఇలాంటి ఆధ్యాత్మిక కార్యక్రమాలు మన సంస్కృతి, సంప్రదాయాలను భావితరాలకు అందించడంలో కీలక పాత్ర పోషిస్తాయని పేర్కొన్నారు. ఈ సందర్భంగా దాసరి మమతారెడ్డిని ఘనంగా సన్మానించారు.
ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీపీ స్రవంతి , మోహన్ రావు, మండల అధ్యక్షులు రామ్ రెడ్డి, సుల్తాన్పూర్ సర్పంచ్ కవ్వంపల్లి బాపయ్య ,నారాయణపూర్ సర్పంచ్ గొడుగుల సతీష్, ఉప సర్పంచ్ రమేష్ రావు, సంతోష్ గౌడ్, కోమాల్ రెడ్డి,సమ్మయ్య, న్యాథరీ పోచాలు ,వినోద్, కార్తీక్ ,తిరుపతిరెడ్డి,కనుకయ్య,బాసంపెల్లిరాజేశం, గోలే లక్ష్మణ్ ,పంగ రవి,నరేష్ ,పొన్నం రాం చంద్రం ,రంజిత్ ,రవీందర్ రెడ్డి, నర్సింగం, మహేష్,అరవింద్,దామ సది ,టీత్ కుమార్ ,గజ్జెల అజయ్ ,సాయినాథ్ ,గంధం వినోద్,మహేందర్, నాయకులు పాల్గొన్నారు.