రైతులకు తప్పని తిప్పలు
- సిండికేట్‌గా మారిన వ్యాపారులు
- కల్లాలలోని ధాన్యం కుప్పలు
- క్వింటాకు ధర రూ.వెయ్యి తగ్గింపు
- ఆందోళన చెందుతున్న అన్నదాతలు
- ఉమ్మడి జిల్లాలో దళారుల హవా!
కామారెడ్డి, నవంబర్ 20 (విజయక్రాంతి): ఆరుగాలం కష్టపడి పండించిన ధాన్యాన్ని అమ్ముకునేందుకు రైతుల(Farmers)కు తిప్పలు తప్పడం లేదు. గతంలో ఒక రకం తిప్పలు ఉంటే ఈసారి వ్యాపారులు సిండికేట్ గా మారి దళారులను రంగంలోకి దించి ముందు అధిక ధరలు క్వింటాల్కు 4000 పైగా ధర పెట్టి రైతులను మురిపించారు. రైతుల వద్దకు ప్రస్తుతం పూర్తిస్థాయిలో ధాన్యం వచ్చిన తర్వాత వ్యాపారులు ధరలు తగ్గించేశారు. అమ్మితే అమ్మండి లేదంటే మీ ఇష్టమంటూ దళారులు రైతులను దగా చేస్తున్నారు. రైస్ మిల్ వ్యాపారులు, దళారి వ్యా పారులతో కుమ్మక్కై ధాన్యం కొనుగోలులో దళారి వ్యాపారులు లను పంపి కిరికిరి చేయిస్తున్నారు. రైతులకు దాన్యం ఆరబెట్టేందుకు నిల్వ ఉంచుకునేందుకు స్థలాలు లేక దళారులు చెప్పిన ధరకే అమ్ముకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది.
ముందు మురిపించారు, ధరలు తగ్గించారు
ఈ సీజన్ ప్రారంభంలో నాలుగు వేల పైచిలుకు ధరను రైతుల చేనుల వద్దకే వచ్చి క్వింటాలకు ధరపెట్టిన వ్యాపారులు, ప్రస్తుతం ముఖం చాటేశారు.
రంగంలోకి దిగిన దళారులు
రైస్ మిల్ వ్యాపారులు దళారు లను రైతుల వద్దకు పంపి బేరం ఆడిస్తున్నారు. ఆమంతంగా వెయ్యి రూపాయలు తగ్గించి ధాన్యాన్ని కొనుగోలు చేసేందుకు దళారులు ముందుకు వస్తున్నారు. ఈ ఏడాది ప్రైవేటు వ్యాపారులు అధిక ధరలకు పెట్టి రైతులకు న్యాయం చేస్తున్నారని సంబరపడ్డ రైతులకు ముందు మురిపించి ప్రస్తుతం కొర్రీలు పెడుతూ ధరను క్విం టాల్కు 1000 రూపాయలు తగ్గించి ఆందోళనకు గురి చేస్తున్నారు.
ధరలు తగ్గించి దగా...
రైతుల అవసరాన్ని దళారి వ్యాపారు లు, కొంతమంది రైస్ మిల్ వ్యాపారులు కుమ్మక్కై రైతులను ధర తగ్గించి దగా చేస్తూ నట్టేట ముంచుతున్నారు. ధాన్యం కుప్పలు పెట్టుకుని రైతులు వ్యాపారుల కోసం ఎదురుచూ డాల్సిన పరిస్థితి ఏర్పడింది. రైతుల అవసరాలను గుర్తించిన వ్యాపారులు దళారులు ధర తగ్గించి రైతులను దగా చేస్తున్నారు. నిజామాబాద్, కామారెడ్డి జిల్లా లో రైతులు ప్రభు త్వం ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాల వ ద్ద ధర తక్కువ వస్తుండడంతో ప్రైవేట్ వ్యా పారులు ధర ఎక్కువ బూచి చూపి రైతులను ప్రస్తుతం నిలువు దోపిడీకి గురి చేస్తున్నారు.
మోసం చేస్తున్న దళారులు
ధాన్యం తూకంలో మోసం, ధరలో వ్యత్యాసం, షాటేజ్ పేరుతో మోసం చేస్తున్నారు. అమాంతంగా 1000 రూపాయలు క్వింటాలకు ధర తగ్గడంతో రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. జిల్లా కలెక్టర్ లో స్పందించి రైతులను నట్టేట ముంచుతున్న వ్యాపారులపై చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. సన్న వడ్లు పండించిన రైతులకు ధరచెల్లిస్తూ, దొడ్డు ధాన్యం పండించిన రైతులను దళారులు పట్టించుకోవడం లేదు. వారు అడిగిన రేటుకి ఇస్తేనే కొనుగోలు చేస్తామని మొఖం చాటేస్తున్నారు. దీంతో రైతులు తిక మక పడుతున్నారు.
రైతులను ఇబ్బందులకు గురి చేస్తే చర్యలు తీసుకుంటాం
రైతులకు ధాన్యం కొనుగోలు లో రైతులకు ఇబ్బందుల కు గురిచేసే వ్యాపారులపై ఫిర్యాదు చేస్తే చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటాం. రైతులను ఇబ్బందులకు గురి చేయవద్దు. ప్రభుత్వం ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో రైతులు ధాన్యాన్ని విక్రయించుకోవాలి.
ఆశిష్ సంగ్వాన్, కామారెడ్డి కలెక్టర్