నష్టపోయిన బీర్నిస్ రైతులకు పరిహారం చెల్లింపు

14-11-2026 | 07:01pm

తాడ్వాయి,నవంబర్,14( విజయక్రాంతి ): కామారెడ్డి జిల్లా(Kamareddy District) తాడ్వాయి మండల కేంద్రంలో శనివారం రాజ్మా బీర్నిస్ విత్తనాలతో(Rajma Bernice seeds) నష్టపోయిన  రైతులు భారతీయ కిసాన్ సంఘ్(Farmers – Bharatiya Kisan Sangh) ఆధ్వర్యంలో ప్రత్యేక సమావేశం నిర్వహించారు.ఈనెల 8న విజయ క్రాంతిలో నకిలీ విత్తనాలతో నష్టం.. అనే కథనంతో ప్రచురితమైన వార్తకు సదరు వ్యాపారి స్పందించారు.రైతులకు పరిహారం అందించడానికి వ్యాపారి ఒప్పుకున్నారు.ఈ సందర్భంగా రాజ్మా బిర్నిస్ విత్తనాలు అందించిన వ్యాపారి గంగయ్యను రైతులు పిలిపించి మాట్లాడారు.

ముందుగా రైతులు ఎకరాకు రూ.20 వేలు పరిహారం అందించాలని కోరారు.అనంతరం రూ. 10 వేలు పరిహారం అందించాలని వారు కోరగా సదరు వ్యాపారి ఎకరాకు రూ.6 వేలు పరిహారం అందిస్తానని   ఒప్పుకున్నట్లు రైతులు తెలిపారు.ఈ కార్యక్రమంలో భారతీయ కిసాన్ సంఘ్ జిల్లా అధ్యక్షులు పైడి విఠల్ రెడ్డి,తాడ్వాయి మండల బిజెపి అధ్యక్షులు వెలమ సంతోష్ రెడ్డి,రైతులు తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు