ఇందిరా గాంధీ జయంతి వేడుకలకు కాంగ్రెస్ శ్రేణులు

18-11-2026 | 02:38pm

బాన్సువాడ, నవంబర్ 18 (విజయ క్రాంతి): కామారెడ్డి జిల్లా బాన్సువాడ పట్టణంలోని తాడ్కోల్ చౌరస్తా వద్ద మాజీ ప్రధాని ఇందిరాగాంధీ జయంతి వేడుకల(Indira Gandhi Jayanti celebrations) నిర్వహణకు చేపడుతున్న ఏర్పాట్లను బుధవారం 13 వ వార్డ్ కౌన్సిలర్ ఖాలేక్, కో-ఆప్షన్ సభ్యులు కాసుల రోహిత్, సిబ్బంది సతీష్, హనుమాన్లు, ఆఫీస్,స్థానిక నాయకులు, సిబ్బంది పరిశీలించారు.

గురువారం నిర్వహించే జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించేందుకు ప్రాంగణం సిద్ధం చేయడం, ఇతర ఏర్పాట్లపై సమీక్షించి అవసరమైన సూచనలు చేశారు. గురువారం ఉదయం 9 గంటలకు తాడ్కోల్ చౌరస్తాలో ఇందిరమ్మ జయంతి వేడుకలను నిర్వహించడం జరుగుతుందని కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు పెద్ద సంఖ్యలో హాజరై విజయవంతం చేయాలని కౌన్సిలర్ ఖాలేక్ తెలిపారు.

ఈ సందర్భంగా కార్యక్రమ నిర్వహణలో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని సూచించారు. ఈ పరిశీలనలో కార్యాలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు