గ్రంథాలయాల లో సమస్యలను పరిష్కరించాలి
కామారెడ్డి, నవంబర్ 17 (విజయక్రాంతి): కామారెడ్డి జిల్లాలోని ఎల్లారెడ్డిలో గ్రంథాలయంలో(Library in Yellareddy) మరుగుదొడ్ల సమస్య తో పాటు ఇబ్బంది పడుతున్నారని జిల్లా గ్రంధాలయ సంస్థ చైర్మన్ మద్దీ చంద్రకాంత్ రెడ్డి మంగళవారం ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్మోహన్(MLA Madan Mohan of Llarreddy) కలిసి వినతి పత్రాన్ని అందజేశారు. జిల్లాలో వివిధ మండలాల్లోని గ్రంథాలయాల లో నెలకొన్న సమస్యలను ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్లారు.
వాటి పరిష్కారానికి చొరవ చూపాలని కోరారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మదన్ మోహన్ రావు సానుకూలంగా స్పందించినట్లు జిల్లా గ్రంధాలయ సంస్థ చైర్మన్ మద్ది చంద్రకాంత్ రెడ్డి తెలిపారు. గ్రంధాలయాల అభివృద్ధికి పాఠకులకు మెరుగైన సేవలు అందించేందుకు సహకరిస్తామని ఎమ్మెల్యే మదన్ మోహన్ రావు హామీ ఇచ్చినట్లు తెలిపారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యేకు జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ మద్ది చంద్రకాంత్ రెడ్డి సన్మానించి కృతజ్ఞతలు తెలిపారు.