ప్రయాణికురాలి లగేజీ, సెల్‌ఫోన్‌ను భద్రంగా అప్పగించిన ఆర్టీసీ సిబ్బంది

17-11-2026 | 09:41pm

జడ్చర్ల, నవంబర్ 17: హైదరాబాద్‌లోని ఎంజీబీఎస్ (MGBS) బస్టాండ్(MGBS Bus Station) నుంచి రాయచూరుకు ప్రయాణిస్తున్న ఆకాంక్ష అనే ప్రయాణికురాలు అనుకోకుండా తన లగేజీ బ్యాగ్, సెల్‌ఫోన్‌ను బస్సులోనే మరిచిపోయింది. వివరాల్లోకి వెళితే.. ఎంజీబీఎస్ బస్టాండ్‌లో రాయచూరు వెళ్లేందుకు బస్సులో సీటు కోసం తన లగేజీ బ్యాగ్‌ను ఉంచిన ఆకాంక్ష, టీ తాగేందుకు బస్సు దిగింది.

అయితే ఆమె తిరిగి వచ్చేలోపే బస్సు రాయచూరుకు బయలుదేరింది. దీంతో తన లగేజీ, సెల్‌ఫోన్ బస్సులోనే ఉండిపోయాయి. ఈ క్రమంలో బస్సు జడ్చర్ల బస్టాండ్‌కు చేరుకున్న సమయంలో విధుల్లో ఉన్న బస్టాండ్ కంట్రోలర్ జీఎల్ గౌడ్, ఆర్టీసీ సెక్యూరిటీ సిబ్బంది లింగంపేట నరసింహులు ప్రయాణికురాలి వస్తువులను భద్రపరిచి ఆమెకు అప్పగించారు.

తన వస్తువులు సురక్షితంగా తిరిగి అందడంతో ఆకాంక్ష సంతోషం వ్యక్తం చేస్తూ ఆర్టీసీ సిబ్బందికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ప్రయాణికుల పట్ల బాధ్యతగా వ్యవహరించి నిజాయితీని చాటుకున్న సిబ్బందిని పలువురు అభినందిస్తున్నారు.

మరిన్ని వార్తలు