చేయూత లబ్ధిదారులకు ప్రొసీడింగ్స్ పంపిణి

17-11-2026 | 09:17pm

ముకరంపుర, నవంబర్ 17(విజయ క్రాంతి): కరీంనగర్ నగరంలోని 42వ డివిజన్‌లో(divisions) అర్హులైన చేయూత పింఛన్(Cheyutha Pension) లబ్ధిదారులకు మంజూరైన వితంతు, దివ్యాంగ, ఒంటరి మహిళ మరియు ఇతర పింఛన్ల ప్రొసీడింగ్స్ పత్రాలను బిజెపి రాష్ట్ర అధికార ప్రతినిధి, నగర డిప్యూటీ మేయర్ యాదగిరి సునీల్ రావు పంపిణీ చేశారు.

మంగళవారం క్యాంపు కార్యాలయంలో నిర్వహించిన కార్యక్రమంలో లబ్ధిదారులకు ప్రొసీడింగ్స్ అందజేసి శుభాకాంక్షలు తెలిపారు.ఈ సందర్భంగా యాదగిరి సునీల్ రావు మాట్లాడుతూ.. నగరంలో చాలా మంది వృద్ధులు పింఛన్ల కోసం ఎదురుచూస్తున్నారని, ప్రభుత్వం తక్షణమే నూతన దరఖాస్తులను స్వీకరించి, అర్హులైన వారందరికీ వృద్ధాప్య పింఛన్లు మంజూరు చేయాలని విజ్ఞప్తి చేశారు.

అదేవిధంగా, ఇటీవల జరిగిన పింఛన్ల వెరిఫికేషన్ ప్రక్రియలో అర్హులైన కొంతమంది లబ్ధిదారుల దరఖాస్తులు ఇతర కారణాలతో తిరస్కరణకు గురయ్యాయని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. అలాంటి దరఖాస్తులను అధికారులు మరోసారి క్షుణ్ణంగా పునఃపరిశీలించి,

అర్హులైన ప్రతి ఒక్కరికీ పింఛన్లు మంజూరు చేసి న్యాయం చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు. ఈ కార్యక్రమంలో డివిజన్ వాసులు, పింఛన్ లబ్ధిదారులు తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు