ఖేలో ఇండియా యూత్ గేమ్స్ 2026 ప్రచార పోస్టర్ల ఆవిష్కరణ
జిల్లా కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్
కామారెడ్డి, నవంబర్ 17 (విజయక్రాంతి): ఖేలో ఇండియా యూత్ గేమ్స్ 2026 ప్రచార పోస్టర్లను మంగళవారం జిల్లా కలెక్టర్ ఆశిష్ సంగువాన్(Collector Ashish Sangwan) ఆవిష్కరించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ, తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా నిర్వహించనున్న ఖేలో ఇండియా యూత్ గేమ్స్–2026పై కామారెడ్డి జిల్లాలో విస్తృత స్థాయిలో ప్రచార కార్యక్రమాలు నిర్వహించాలని అన్నారు. జిల్లాలోని అన్ని విద్యాసంస్థలు, ప్రభుత్వ కార్యాలయాలు, ప్రధాన కూడళ్లు, జనసంచారం అధికంగా ఉండే ప్రాంతాల్లో ఖేలో ఇండియా యూత్ గేమ్స్ 2026 ప్రచార పోస్టర్లను ఏర్పాటు చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో జిల్లా అదనపు కలెక్టర్ (రెవెన్యూ) విక్టర్, ఎల్లారెడ్డి ఆర్ డి ఓ ప్రభాకర్, జిల్లా యువజన, క్రీడల శాఖ అధికారి రంగ వెంకటేశ్వర్ గౌడ్, జిల్లా గిరిజన సంక్షేమ శాఖ అధికారిణి సౌజన్య, జిల్లా అధికారులు పాల్గొన్నారు.