మహిళా మత్స్యకారుల ఆర్థిక స్వావలంబనకు కృషి

17-11-2026 | 09:38pm

సొసైటీ అధ్యక్షురాలు గిరమోని పార్వతమ్మ

జడ్చర్ల,నవంబర్ 17 : మహిళా మత్స్యకారుల ఆర్థిక, సామాజిక అభివృద్ధికి ప్రభుత్వ పథకాలు(Government Schemes), సహకార రంగ అవకాశాలను సద్వినియోగం చేసుకుంటామని మత్స్యకారుల మార్కెటింగ్ మహిళా కో-ఆపరేటివ్ సొసైటీ అధ్యక్షురాలు గిరమోని పార్వతమ్మ అన్నారు. మంగళవారం జడ్చర్ల మున్సిపాలిటీ పరిధిలోని కావేరమ్మపేట మత్స్యకారుల మార్కెటింగ్ మహిళా కో-ఆపరేటివ్ సొసైటీ ఎన్నికలు జిల్లా కో-ఆపరేటివ్ కార్యాలయ అధికారి ఓ. శ్రీనివాస్ పర్యవేక్షణలో ఏకగ్రీవంగా జరిగాయి. మొత్తం 9 మంది డైరెక్టర్లు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.

నూతన కార్యవర్గం అధ్యక్షురాలిగా గిరమోని పార్వతమ్మ, కార్యదర్శిగా గోనెల కృష్ణవేణి, ఉపాధ్యక్షురాలిగా ఎన్. శివలీల, కోశాధికారిగా జి. మంజుల, డైరెక్టర్లుగా శివలీల, సుమలత, అమృత, భాగ్య, నాగలక్ష్మి ఎన్నికయ్యారు. మత్స్య ఉత్పత్తులకు మెరుగైన మార్కెటింగ్ సౌకర్యాలు, ఉపాధి అవకాశాలు కల్పిస్తూ సంఘాన్ని బలోపేతం చేస్తామని నూతన కార్యవర్గం పేర్కొంది. పలువురు వారికి శుభాకాంక్షలు తెలిపారు.

మరిన్ని వార్తలు