తప్పుడు డెత్ పత్రాల పై కొరడా..

17-11-2026 | 09:35pm
  1. నలుగురు కార్యదర్శులు సస్పెన్షన్ 
  2. నకిలీ డెత్ సర్టిఫికెట్ల ఘటనపై పోలీసు కేసు 

బెల్లంపల్లి,నవంబర్ 17: మంచిర్యాల జిల్లా బెల్లంపల్లిలో నకిలీ డెత్ సర్టిఫికెట్ల జరిపి అధికారులు కోరడా ఝళిపించారు. మండలంలోని బూధకుర్దు గ్రామపంచాయతీ కేంద్రంగా(Gram Panchayat Headquarters) నకిలీ డెత్ సర్టిఫికెట్ల వ్యవహారం వెలుగు చూసింది. ఇందులో అధికార పార్టీకి చెందిన నాయకులు, పంచాయతీ కార్యదర్శిలు కలిసి ఈ దందాకు తెరదీశారు.

నకిలీ డెత్ సర్టిఫికెట్ల అక్రమ వ్యవహారం లో కీలకులుగా భావిస్తున్న నలుగురు కార్యదర్శులపై వేటు పడింది. ఈ మేరకు జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ సస్పెన్షన్ విధిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. అక్రమంగా నకిలీ డెత్ సర్టిఫికెట్ల జారీ చేసిన ఘటనలో  బూధకుర్డు కార్యదర్శి సాధుల్లా, ఇంచార్జీ గా ఉన్న కన్నాల కార్యదర్శి బోర్లకుంట శ్రీనివాస్, బదిలీ పై వెళ్లిన స్మిద్దా,పేర్కపల్లి కార్యదర్శి ఎస్ సాయిరాం కు సస్పెన్షన్ విధిస్తూ ఈ నోటీసులు జారీ చేశారు.

ఈ వ్యవహారంలో మరో కీలక పాత్రదారి ఎంపిడివో ఆఫీసులో కంప్యూటర్ ఆపరేటర్ శ్రీనివాస్ తో  పాటు నలుగురు కార్యదర్శులపై అధికారులు తాళ్ళ గురజాల పోలిస్టేషన్ లో ఫిర్యాదు చేశారనీ తెలిసింది. కూపీ లాగితే మండలంలో 29 తప్పుడు డెత్ సర్టిఫికెట్ల వ్యవహారం బయటపడింది.

అక్రమంగా జారీ చేసినా డెత్ పత్రాలపై ప్రజావాణి కి మాజీ జడ్పీవైస్ చైర్మన్ తొంగల సత్యనారాయణ, ఉపసర్పంచ్ సుంకరి ప్రశాంతి ఫిర్యాదు చేశారు. ఈమేరకు జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ నకిలీ డెత్ సర్టిఫికెట్ల పై సీరియస్ గా స్పందించారు.

ప్రజావాణి  ఫిర్యాదుతో నలుగురిపై వేటు వేస్తూ ఆర్డర్ జారీ చేశారు. ఈ నేపథ్యంలో మండలంలో గుట్టు చుప్పుగా సాగుతున్న తప్పుడు డెత్ పత్రాల రాకెట్ పై విజయ క్రాంతి లో "అక్రమాలకు భారీ స్కెచ్" అనే శీర్షకన వచ్చిన కథనం అధికారుల్లో కదలిక తెచ్చింది.

కాగా స్పందించిన జిల్లా ఉన్నతాధికారులు నకిలీ డెత్ సర్టిఫికెట్ల దందా ను నేర్పుతున్న పంచాయతీ కార్యదర్శిలపై కొరడా ఝళిపించారు. కార్యదర్శి ల పై వేటుతో,మండల అధికార గణంలో  గుబులు మొదలైంది. విచారణ  మొదలైతే తప్పుడు డెత్ పత్రాల రాకెట్ మూలాలు కదలుతాయని పలువురు అభిప్రాయ పడుతున్నారు.

మరిన్ని వార్తలు