ఆస్తులకు నష్టం లేకుండా ఆర్ఓబి అలైన్మెంట్ మార్చాలి
మహబూబాబాద్, నవంబర్ 29 (విజయక్రాంతి): ప్రజల ఆస్తులకు నష్టం వాటిల్లకుండా నూతనంగా నిర్మించే ఆర్ ఓ బి అలైన్మెంట్ మార్చాలని సిపిఐ జిల్లా కార్యదర్శి విజయ సారధి రెడ్డి(CPI District Secretary Vijay Sarathi Reddy) డిమాండ్ చేశారు. ఆర్ఓబి నిర్వాసితుల ఆధ్వర్యంలో ఆదివారం సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పట్టణ అభివృద్ధి అంటే ఇండ్లు కూల్చడం కాదని, ప్రజల ఇబ్బందులను గుర్తించి వారికి ఎలాంటి నష్టం లేకుండా అభివృద్ధి పనులను చేపట్టే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కోరారు. గతంలో అండర్ బ్రిడ్జి నిర్మించి అనేకమందికి ఇబ్బందులు కలిగించారని, ఇప్పుడు అలాంటి పరిస్థితి రాకుండా, ప్రజలకు ఇబ్బందులు కలగకుండా అలైన్మెంట్ వెంటనే మార్చాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సిపిఐ మున్సిపల్ ఫ్లోర్ లీడర్ అజయసారథి రెడ్డి,25 వ వార్డు కౌన్సిలర్ నర్రా సంధ్య శ్రావణ్ ,నీలం వెంకటేశ్వర్లు, మంద శంకర్, తండా శ్రీనాథ్ పాల్గొన్నారు.