పెంటల నర్సాగౌడ్‌కు ఘన సన్మానం
17-11-2026 | 10:15pm
భిక్కనూర్, నవంబర్ 17 (విజయక్రాంతి): భిక్కనూర్ మండలం కంచర్ల గ్రామానికి చెందిన పెంటల నర్సాగౌడ్(Pentala Narsagoud) పెద్దమల్లారెడ్డి పీఏసీఎస్ సొసైటీ డైరెక్టర్‌గా ఎన్నికైన సందర్భంగా గ్రామంలో ఘనంగా సన్మానించారు. పార్టీలకు అతీతంగా గ్రామస్తులందరూ ఏకమై ఆయనకు శుభాకాంక్షలు తెలిపి సత్కరించారు. రాజకీయాలకు అతీతంగా వ్యక్తికి ఇచ్చే గౌరవం, గ్రామస్తుల మధ్య ఉన్న ఐక్యతకు ఈ సన్మానం నిదర్శనంగా నిలిచిందని పలువురు పేర్కొన్నారు. నూతన డైరెక్టర్‌గా ఎన్నికైన పెంటల నర్సాగౌడ్‌కు గ్రామస్తులు అభినందనలు తెలిపారు.