అక్రమాలపై సమగ్ర విచారణ జరిపించాలి
కొత్తపల్లి, నవంబర్ 17 (విజయక్రాంతి): కరీంనగర్ ప్రభుత్వ నర్సింగ్ కళాశాలలో వారధి సొసైటీ ఆధ్వర్యంలో చేపట్టిన ఉద్యోగ నియామకలో అవినీతి అక్రమాలు రిజర్వేషన్లు ఉల్లంఘన సర్టిఫికెట్ల అవకతవక లపై వెంటనే సమగ్ర విచారణ జరిపించి నిరుద్యోగులకు న్యాయం చేయాలని కోరుతూ ఏఐవైఎఫ్ జిల్లా సమితి ఆధ్వర్యంలో జిల్లా కలెక్టర్ చిత్రా మిశ్రా(Collector Chitra Mishra)కు కలెక్టర్ కార్యాలయంలో మంగళవారం వినతిపత్రం అందజేయడం జరిగింది.
ఈ సందర్భంగా ఏఐవైఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి బ్రాహ్మణపల్లి యుగంధర్ మాట్లాడుతూ కరీంనగర్లో నూతనంగా ఏర్పాటుచేసిన ప్రభుత్వ నర్సింగ్ కళాశాలలో వివిధ కేటగిరీలో సుమారు 20 ఉద్యోగాల భర్తీకి వారధి సొసైటీ ఆధ్వర్యంలో 2026 సంవత్సరంలో నోటిఫికేషన్ విడుదల చేశారని, ఈ నియామక ప్రక్రియలో రిజర్వేషన్ అమలు రోస్టర్ విధానం సీనియార్టీ ప్రాతిపదిక ఎంపిక చేయాల్సి ఉన్నప్పటికీ నిబంధనలు ఏమాత్రం పాటిoచకుండా వారధి అధికారులు అవినీతికి అక్రమాలు చేశారని ఆయన విమర్శించారు.
వారధి అధికారులు నోటిఫికేషన్లు మాత్రం రోస్టర్ ఆఫ్ రిజర్వేషన్ తో పాటు సీనియార్టీ ప్రతిపాదికన నియమకాలు చేపడతామని స్పష్టంగా చెప్పి ఈ పోస్టుల వివిధ కేటగిరీల నుంచి పెద్ద సంఖ్యలో నిరుద్యోగ దరఖాస్తులు తీసుకున్నారని తెలిపారు. ఎంపికైన కొందరు అభ్యర్థులు సమర్పించిన విద్యార్థుల సర్టిఫికెట్లను వివరాలకు వారు దరఖాస్తులు పొందుపరిచిన మార్కులకు పొంతనలేదని అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి అన్నారు.
గతంలో కూడా ఇదే వారధి సొసైటీ చేపట్టిన నియమాకలపై అనేక ఆరోపణలు ఉన్నాయని ఒకే కుటుంబానికి చెందిన పలువురికి ఉద్యోగాలు కల్పించారని ఆరోపణతో పాటు డబ్బులు తీసుకుని పోస్టులు ఇచ్చారు అనే విమర్శలు వ్యక్తం అయ్యాయని ఆరోపించారు.ఈ వినతి పత్రం సమర్పణలో ఏఐవైఎఫ్ జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ కసి బోసుల సంతోష్ చారి,జిల్లా ఉపాధ్యక్షులు చెoచల మురళి నగర సహాయ కార్యదర్శి జువాజి తిరుపతి తదితరులు పాల్గొన్నారు.