ప్రభుత్వ పాఠశాలలకు గ్రీన్ బోర్డుల పంపిణీ..

17-11-2026 | 10:08pm

నాగర్‌ కర్నూల్ (విజయక్రాంతి): కుచకుళ్ల ఫౌండేషన్ ఆధ్వర్యంలో 11 ప్రభుత్వ పాఠశాలలకు గ్రీన్ బోర్డులను ఎమ్మెల్యే డాక్టర్ కూచుకుళ్ల రాజేష్ రెడ్డి(MLA Dr Kuchukulla Rajesh Reddy), డాక్టర్ కూచుకుళ్ల సారితా రెడ్డి పంపిణీ చేశారు. తూడుకుర్తి, ఎండబెట్ల, నాగనూల్, అరబ్‌గల్లి, దర్గా, బిజినపల్లి, తాడూరు, వెల్గొండ, నడిగడ్డ పాఠశాలలకు బోర్డులు అందజేశారు. ప్రభుత్వ పాఠశాలల్లో మెరుగైన బోధనా వాతావరణం కల్పించడమే లక్ష్యంగా ఈ కార్యక్రమం చేపట్టినట్లు ఫౌండేషన్ ప్రతినిధులు తెలిపారు.

మరిన్ని వార్తలు