టిఆర్టిఎఫ్ లో చేరిన పి.ఆర్.టి.యు రాష్ట్ర మాజీ అధ్యక్షుడు

29-11-2026 | 07:41pm

500 మంది అనుచరులతో చేరిన దామోదర్ రెడ్డి 

టిఆర్టిఎఫ్ బలోపేతానికి కృషి 

సముచిత స్థానం కల్పిస్తామని టిఆర్టిఎఫ్ రాష్ట్ర నాయకుల పిలుపు 

కామారెడ్డి, నవంబర్ 29 (విజయక్రాంతి): పి ఆర్ టి యు రాష్ట్ర అధ్యక్షుడిగా పని చేసిన పులగం దామోదర్ రెడ్డి(Pulagam Damodar Reddy) టిఆర్టిఎఫ్ లో 500 మంది అనుచరులతో ఆదివారం కామారెడ్డిలో చేరారు. ఆయనకు రాష్ట్ర టిఆర్టిఎఫ్ నాయకత్వం, ప్రతినిధులు ఘనంగా స్వాగతం పలికారు. పి ఆర్ టి యు లో దామోదర్ రెడ్డికి సముచిత స్థానం లభించకపోవడం వల్లే టి ఆర్ టి ఎఫ్ చేరారని తెలిపారు. కామారెడ్డి గెలాక్సీ గార్డెన్ లో పిఆర్టియు రాష్ట్ర మాజీ అధ్యక్షుడు పులగం దామోదర్ రెడ్డి 500 మంది అనుచరులతో టిఆర్టిఎఫ్ తో చేరారు.

పి ఆర్ టి యులో ఏంతో కీలకంగా పని చేసిన పులగం దామోదర్ రెడ్డి రాష్ట్ర అధ్యక్షునిగా బాధ్యతలు చేపట్టి ఎంతో సంఘ పటిష్ట వంతానికి కృషి చేశారు. పి ఆర్ టి యులో సముచిత స్థానం లభించడం లేదని టీ ఆర్ టి ఎఫ్ లో చేరారు. ఆయనకు టిఆర్పిఎఫ్ రాష్ట్ర నాయకులు రాష్ట్ర అధ్యక్షుడు కటకం రమేష్, ప్రధాన కార్యదర్శి అంజిరెడ్డిలు పులగం దామోదర్ రెడ్డికి స్వాగతం పలికారు. రాష్ట్ర సలహాదారుగా పులగం దామోదర్ రెడ్డిని నియమిస్తున్నట్లు తెలిపారు. 500 మంది తన అనుచరులతో టిఆర్టిఎఫ్ లో చేరారు. టిఆర్టిఎఫ్ ప్రతిష్టవంతానికి చేస్తానని ఈ సందర్భంగా పులగం దామోదర్ రెడ్డి తెలిపారు.

మరిన్ని వార్తలు