కిచెన్లలో బొద్దింకలు, బల్లులు!
- కుళ్లిన ఆహార పదార్థాలు, అపరిశుభ్రత
- మూడు జిల్లాల్లో హైవే పక్కన రెస్టారెంట్లలో తనిఖీ
- ఓ హోటల్ సీజ్.. మరికొన్నింటికి నోటీసులు
- 9 రెస్టారెంట్ల లైసెన్స్ రద్దు
- ఆరు హోటళ్లకు సస్పెన్షన్ నోటీసులు
- టీజీ సేఫ్ ప్రత్యేక చర్యలు
కామారెడ్డి, అక్టోబర్ 6 (విజయక్రాంతి)/భిక్కనూర్: మెదక్, నిజామాబాద్, కామారెడ్డి(Medak, Nizamabad, Kamareddy), జిల్లాలోని 44వ జాతీయ రహదారి వెంట ఉన్న రెస్టారెంట్ల(Restaurants)లో మంగళవారం తెలంగాణ ఆహార భద్రత(Telangana Food Security) ప్రత్యేక అధికారులు 20 బృం దాలతో ఆకస్మికంగా తనిఖీలు చేపట్టారు. పలు రెస్టారెంట్లలో టీజీ సేఫ్ ప్రత్యేక అధికారుల బృందాలు(TG SAFE Special Officer Teams) తనిఖీలు చేసి 9 రెస్టారెంట్ల రైసెన్సులను రద్దు చేశారు. మరో ఆరు రెస్టారెంట్ల ఆహా ర లైసెన్సులు సస్పెన్షన్ చేశారు. మరో ఐదు సంస్థలకు ఇంప్రూవ్మెంట్ నోటీసులు జారీ చేశారు.
ప్రజలకు సురక్షితమైన, నాణ్యమైన ఆ హారం అందేలా చర్యలు తీసుకునేలా తనిఖీలు చేపట్టినట్లు అధికారులు తెలిపారు. టీజీ సేఫ్‌కు చెందిన 10 ఎన్‌ఫోర్స్‌మెంట్ బృందాలు మూడు జిల్లాల్లో మొత్తం 20 రెస్టారెంట్లను తనిఖీ చేశాయి. కామారెడ్డి జిల్లాలో 8 రెస్టారెంట్లను తనిఖీ చేశారు. తనిఖీల సందర్భంగా జైకా మల్టీ క్యూజిన్ ఫ్యామిలీ రెస్టారెంట్ (బస్వాపూర్), ది మాల్గుడి రెస్టారెంట్ (అంతంపల్లి, భిక్నూర్), వసుధ ఫ్యామిలీ రెస్టారెంట్ (భిక్నూర్), న్యూ ఉడిపి కృష్ణ భవన్ (అడ్లూర్), లుఫ్యాన్స్ ఫ్యామిలీ రెస్టారెంట్ (అడ్లూర్ ఎల్లారెడ్డి), తాజ్ ఫ్యామిలీ దాబా (సదాశివనగర్) లో పరిశుభ్రత లోపాలు, ఆహార పదార్థాల సక్రమ నిల్వ లేకపోవడం, కీటకాల ఉనికి, గడువు ముగిసిన ఆహార పదార్థాలు, వంటగది అపరిశుభ్రత తదితర తీవ్రమైన ఉల్లంఘనలు గుర్తించారు.
దీంతో ఆయా సంస్థల ఆహార లైసెన్సులను సస్పెండ్ చేసి, వ్యాపార కార్యకలాపాలను తక్షణమే నిలిపివేయాలని ఆదేశించా రు. శ్రీ ఆధ్య గ్రాండ్ మల్టీ క్యూజిన్ రెస్టారెంట్ (జంగంపల్లి)కు షోకాజ్ నోటీసు జారీ చేసి జరిమానా విధింపునకు చర్యలు చేపట్టినట్లు అధికారులు తెలిపారు. ఆర్‌ఎస్ గ్రాండ్ రెస్టారెంట్ (నర్స న్నపల్లె)కు లోపాలను సరిదిద్దుకోవాలని ఇంప్రూవ్మెంట్ నోటీసు జారీ చేశారు. మూ డు జిల్లాల్లో నిర్వహించిన తనిఖీల్లో కల్తీ అనుమానంతో 21 ఆహార నమూనాలను అధికారులు సేకరించారు.